CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ని కొరివి దెయ్యంతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని వ్యాఖ్యలు, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కొరివి దెయ్యాన్ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ఆ కొరివి దెయ్యం పట్టించుకోలేదని మండిపడ్డారు.

Telangaan CM Revanth Reddy Slams Former CM KCR on Employnement (X/Congress)

Hyd, Oct 9: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కొరివి దెయ్యంగా అభివర్ణించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కొరివి దెయ్యాన్ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ఆ కొరివి దెయ్యం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితల ఉద్యోగాలు ఊడితేనే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని తాను ఆనాడే చెప్పానని రేవంత్ అన్నారు. చెప్పినట్టుగానే తమ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ పత్రాలు ఇచ్చామని చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేశామని అన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న 34 వేల ఉద్యోగుల బదిలీలు చేశామని చెప్పారు. ఉద్యోగాలు పొందిన మీ అందరి ఆనందం చూసి కొందరు కళ్లలో నిప్పులు పోసుకుంటారని అన్నారు.

అది అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుని చనిపోతా, రేవంత్ రెడ్డి సర్కారుకి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్

కేసీఆర్ కూతురు కవిత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే... ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని రేవంత్ దుయ్యబట్టారు. కేసీఆర్ బంధువు బోయినపల్లి వినోద్ ఓడిపోతే... ఆయనను ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ చేసుకున్నారని చెప్పారు. మరి, తెలంగాణ కోసం త్యాగం చేసిన నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. మీ ఇంట్లో సంతోషం ఉండాలి కానీ... పేద ప్రజల ఇళ్లలో సంతోషం వద్దా? అని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా... పేదలు, నిరుద్యోగుల కోసం పని చేస్తున్నానని రేవంత్ చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తే బాగుంటుందని... కానీ, ఆయన అది చేయడం లేదని దుయ్యబట్టారు. బిల్లా, రంగాలను (కేటీఆర్, హరీశ్) ఊరి మీదకు వదిలి తమ కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు నామోషీగా ఫీల్ అవుతున్నారని... ఆ పరిస్థితి మారాలని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఈనెల 11న యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణపై నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాకే నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. 24 గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఏకసభ్య కమిషన్ నిర్ణీత గడువులోగా నివేదికను సమర్పించాలని సూచించారు.

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. నాలుగుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ చివరకు ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించి... ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు