Telangana Thalli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం

హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.

Telangana government set to install the statue of the Mother of Telangana at the Secretariat Here New Telangana Thalli Staute

Hyd, Dec 06: తెలంగాణ సచివాలయం(Secretariat)లో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి(Telangana Talli) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం గ్రాండ్‌గా జరుగనుంది. సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.

వీడియో ఇదిగో, మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద పార్కింగ్‌ చేసిన బైక్‌లు మంటల్లో దగ్ధం

తెలంగాణ తల్లి విగ్రహం రూపులేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కుమార్తె కవితను పోలి ఉందన్న విమర్శలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో.. దొరల అహంకారానికి గుర్తుగా ఉందని ఆరోపిస్తూ వచ్చారు. చివరకు ఆయన అన్నట్లుగానే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించి ఆవిష్కరణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.