Telangana Governor Approves Hydraa Ordinance: హైడ్రాకు ఫుల్ ప‌వ‌ర్స్, ఆమోదం తెలిపిన గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌, ఇక దూకుడు పెంచ‌నున్న హైడ్రా

ఈ మేర‌కు శ‌నివారం రాజ్‌భ‌వ‌న్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఇక‌పై హైడ్రా చేప‌ట్ట‌బోయే అన్ని కార్య‌క‌లాపాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భించింది.

HYDRA Action in Sunnam Cheruvu (Credits: X)

Hyderabad, OCT 05: హైద‌రాబాద్ విపత్తు స్పంద‌న‌, ఆస్తుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప‌రిర‌క్ష‌ణ ఏజెన్సీ(Hydraa)కు విస్తృత అధికారాలు క‌ల్పిస్తూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు (Hydraa Ordinance) రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ (Governor Jishnudev Varma) ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం రాజ్‌భ‌వ‌న్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఇక‌పై హైడ్రా చేప‌ట్ట‌బోయే అన్ని కార్య‌క‌లాపాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భించింది. ఈ చ‌ట్టాన్ని రాబోయే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ చ‌ట్టంలో కొత్త‌గా 374(బీ) సెక్ష‌న్‌ను చేర్చుతూ ఆర్డినెన్స్ జారీ అయింది. జ‌లాశ‌యాలు, రోడ్లు, పార్కులు, ఇత‌ర ఆస్తులు కాపాడే బాధ్య‌త అప్ప‌గించారు. అధికారి లేదా ఏజెన్సీకి అప్ప‌గించే అధికారం ప్ర‌భుత్వానికి క‌ల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది. జీహెచ్ఎంసీ చ‌ట్టంలో కొత్త‌గా 374(బీ) సెక్ష‌న్‌ను చేర్చుతూ ఆర్డినెన్స్ జారీ అయింది. జ‌లాశ‌యాలు, రోడ్లు, పార్కులు, ఇత‌ర ఆస్తులు కాపాడే బాధ్య‌త అప్ప‌గించారు. అధికారి లేదా ఏజెన్సీకి అప్ప‌గించే అధికారం ప్ర‌భుత్వానికి క‌ల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది.

Here's the Tweet

 

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ నివృత్తి చేయడంతో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోద ముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపకశాఖ సేవలకు ఎన్‌వోసీ జారీచేయడం తదితర లక్ష్యాలతో జులై 19న జీవో ఎం.ఎస్‌ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది.

Aravind Kejriwal: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్, పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్న కేజ్రీవాల్...వీడియో ఇదిగో 

రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా.. ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు దఖలు పడ్డాయి. ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే పలువురు ఉన్నతాధికారులు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది.



సంబంధిత వార్తలు

KTR: గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు..ధాన్యం రాశుల వైపు చూడాలని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్, కాసుల కక్కుర్తి కాదు..రైతు బతుకు వైపు చూడాలని సవాల్

CM Revanth Reddy: యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిందే, వర్సిటీల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని వీసీలను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి...తప్పు చేస్తే వీసీలపై చర్యలు తప్పవని హెచ్చరిక

Harishrao: హైదరాబాద్‌లో సముద్రమా?, ప్రజలంతా నవ్వుకుంటున్నారు..రేవంత్ రెడ్డి సీఎం కాదు జోకర్ మండిపడ్డ మాజీ మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ భిక్షతోనే సీఎంగా రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: డాక్టర్ కావాలన్న గిరిజన విద్యార్థిని కోరిక నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విద్యకు కావాల్సిన సాయాన్ని అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి