Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు

సెక్షన్‌ 10ఏ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను ధర్మాసనం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.

Telangana High Court (photo-File Image)

Hyd, Nov 19: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్‌ 10ఏ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను ధర్మాసనం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారంటూ పలువురు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేసింది.క్రమబద్దీకరణ (రెగ్యూలరైజ్‌) ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

 ‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌ మూర్తి.. సంజయ్‌ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ

విద్య, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెగ్యూలరైజ్‌ చేసింది. 2016లో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవో 16ను సవాల్‌ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్‌ జీవోను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించ వద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మిగిలిన ఖాళీలను చట్టప్రకారం భర్తీ చేయాలని సర్కార్‌కు ఆదేశించింది. పూర్తి వివరాలను ఆర్డర్‌ కాపీలో పేర్కొంటోమని వెల్లడించింది.ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా చేయాలని కోర్టు తీర్పును వెలువరించింది.

రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,909 మంది జూనియర్‌ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్‌), 390 మంది పాలిటెక్నిక్‌, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు.



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif