Telangana Group-1 Exams Update: గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్, మరో ఆరు రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, నోటిఫికేషన్లపై పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు.
Hyd, Oct 15: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలిగింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.
ప్రిలిమ్స్‌లోని ఏడు ప్రశ్నలకు ఫైనల్ 'కీ'లో సరైన సమాధానాలు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాటికి మార్కులు కలిపి మళ్లీ మెయిన్స్‌కు ఎంపిక అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.