Hyderabad Rains: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు,హైదరాబాద్‌లో ఉదయం నుండే భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఇప్పటికే రెండు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా వాయుగుండం ప్రభావంతో వర్షాలు మరింత ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.
Hyd, Oct 16:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రెండు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా వాయుగుండం ప్రభావంతో వర్షాలు మరింత ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.
వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 490 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 500 కిలోమీటర్లు, నెల్లూరుకు 590 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉండగా ఈనెల 17న పుదుచ్చేరి- చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉంది.దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక హైదరాబాద్‌లో ఉదయం నుండే పలు చోట్ల వర్షం కురిసింది. పంజాగుట్ట, బోరబండ, మూసాపేట, ఉప్పల్, రామంతపూర్, కోటి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురియగా రాత్రి వరకు మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. చెన్నై, బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు, చెన్నైలో పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి
ఇవాళ నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, ములుగు, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు వాతావరణ శాఖ హైఅలర్ట్ ప్రకటించారు.