Chennai, OCT 16: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై(Chennai), బెంగళూరులో (Bangalore) పాఠశాలు, కళాశాలలకు సెలవు (Holiday) ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ వర్షాల (Heavy Rains) హెచ్చరికల దృష్ట్యా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మూసివేయలని పేర్కొంది.
Heavy rains in Chennai
#WATCH | Chennai, Tamil Nadu: Efforts to pump out the water underway in the city.
(Visuals from Choolaimedu area) pic.twitter.com/AmkXKE1Ve0
— ANI (@ANI) October 16, 2024
గురువారం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD Alert) తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పీడన ప్రాంతం పశ్చిమం నుంచి వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం అల్పపీడనంగా మారింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో బెంగళూరు, చెన్నైలలో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని నగరంలో మోహరించారు.
Heavy rainfall causes waterlogging in Chennai
#WATCH | Chennai, Tamil Nadu: Heavy rainfall causes waterlogging in several parts of the city
(Visuals from Choolaimedu area) pic.twitter.com/3hWHlXfPSL
— ANI (@ANI) October 16, 2024
‘‘బెంగళూరులో భారీ వర్షాల నేపథ్యంలో బెంళూరులో హై అలర్ట్ (High alert) ప్రకటించాం. ఇప్పటికే బెంగళూరులో సుమారు 60 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మోహరించాం. ఏదైనా అవసరం కోసం సిద్ధంగా ఉండటానికి మరో 40 మందిని మళ్లీ నియమించాం. అగ్నిమాపక , అత్యవసర సేవలను సిబ్బందిని అందుబాటులో ఉంచాం’ అని కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు.