Thane Shocker: మద్యం మత్తులో భార్యను తగలబెట్టిన కిరాతక భర్త, తలపై కర్రతో కొట్టి స్పహ తప్పిన తరువాత కట్టెలు పేర్చి నిప్పు అంటించి హత్యచేసి పారిపోయిన కసాయి
ఈ సంఘటన (Thane Shocker) ముంబైలో భీవండీలోని స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంతోశ్ చౌరసియా తన భార్య కవిత ఇద్దరు పిల్లలతో కలిసి చావింద్రలోని మహం కాళి దాబా ప్రక్కనే ఉన్న గుడిసెలో నివసిస్తున్నారు.
Bhiwandi, June 10: స్పృహ తప్పిన భార్యను బతికుండగానే ( burns body in Bhiwandi) తగలబెట్టాడు ఓ తాగుబోతు భర్త. ఈ సంఘటన (Thane Shocker) ముంబైలో భీవండీలోని స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంతోశ్ చౌరసియా తన భార్య కవిత ఇద్దరు పిల్లలతో కలిసి చావింద్రలోని మహం కాళి దాబా ప్రక్కనే ఉన్న గుడిసెలో నివసిస్తున్నారు.
కూలి పనిచేసే సంతోష్ వ్యసనాల కారణంగా పనికిపోక తరుచుగా భార్యతో గొడవ పడేవాడు. మంగళవారం మద్యం సేవించిన సంతోశ్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆవేశంతో సంతోశ్ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పహతప్పిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వ చేసిన కర్రల కుప్ప దగ్గరకు కవితను లాకొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి నిప్పు అంటించి హత్య (Drunk man kills wife) చేసి పారిపోయాడు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.
ఇక ఓ యువకుడు యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన మండ్య నగరంలోని కర్ణాటక రాష్ట్రంలో మండ్య వైద్య కళాశాల ఆవరణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... మండ్య తాలూకా వై యరహళ్లి గ్రామానికి చెందిన నవ్య (20) మండ్య మిమ్స్ ఎంఆర్‌డీ విభాగంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన తన బంధువు పరమేశ్, నవ్య నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల నవ్య పరమేశ్‌కు దూరంగా ఉంటోంది. దీన్ని సహించలేని పరమేశ్ ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు.గురువారం మధ్యాహ్నం నుంచి నవ్య కోసం అక్కడే వేచి ఉన్నాడు. 4.30 గంటల సమయంలో నవ్య కళాశాల నుంచి బయటకు రాగా తను వెంట తెచ్చుకున్న బలమైన కట్టెతో దాడి చేశాడు. దీంతో నవ్య తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడే ఉన్న విద్యార్థులు పరమేశ్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్ర రక్తస్రావమైన నవ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు.