Adah Sharma Accident: హీరోయిన్ అదాశర్మకు యాక్సిడెంట్, కేరళ స్టోరీ దర్శకుడితో పాటూ కారులో వెళ్తుండగా ప్రమాదం
ముంబైలో జరుగుతున్న ఒక ప్రైవేట్ ఈవెంట్ కి వీరిద్దరూ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో సుదీప్తో సేన్, ఆదా శర్మ గాయ పడడంతో వారిద్దర్నీ వెంటనే హాస్పిటల్ కి తరలించించారు. కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యినట్లు సమాచారం.
Mumbai, May 14: అదా శర్మ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story ). సుదీప్తో సేన్ (Sudipto Sen) డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలకు ఎన్నో సమస్యలు ఎదురుకుంది. కానీ రిలీజ్ తరువాత ఆ సమస్యలు, ఆ వివాదాలు సినిమా విజయాన్ని ఏ మాత్రం ఆపలేకపోయాయి. వివాదాల కారణంగా చాలా తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయిన ఈ చిత్రం మౌత్ టాక్ తో జనాల్లోకి వెళ్లి కేవలం 9 రోజుల్లోనే 112.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ సక్సెస్ తో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషిలో ఉంది. అయితే ఈ సమయంలో దర్శకుడు సుదీప్తో సేన్, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో జరుగుతున్న ఒక ప్రైవేట్ ఈవెంట్ కి వీరిద్దరూ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో సుదీప్తో సేన్, ఆదా శర్మ గాయ పడడంతో వారిద్దర్నీ వెంటనే హాస్పిటల్ కి తరలించించారు. కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యినట్లు సమాచారం. అయితే వీరిద్దరూ ఈరోజు సాయంత్రం (మే 14) కరీంనగర్‌లో జరిగే హిందూ ఏక్తాయాత్రకు హాజరు కావాల్సి ఉంది. యాక్సిడెంట్ అవ్వడంతో ఆ కార్యక్రమానికి రాలేకపోతున్నాము అంటూ సుదీప్తో సేన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
అటు హీరోయిన్ అదా శర్మ సోషల్ మీడియా ద్వారా ప్రస్తుత తన పరిస్థితి తెలియజేసింది. “యాక్సిడెంట్ వార్త తెలియడంతో అందరూ కంగారు పడుతున్నారు. దీంతో నాకు ఎన్నో మెసేజ్స్ వస్తున్నాయి. సీరియస్ ఏమి లేదు. స్వల్పంగా గాయపడ్డాం అంతే. నేను, మా మూవీ టీం మొత్తం బాగానే ఉన్నాము” అంటూ ట్వీట్ చేసింది.
కాగా కేరళ స్టోరీ సినిమాలో ఆదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళలోని (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ స్టోరీ లైన్ వలనే అనేక విమర్శలకు గురి అయ్యింది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అయితే ఈ సినిమాని ఏకంగా బ్యాన్ చేస్తూ ఉత్తర్వూలు కూడా జారీ చేశారు.