Guidelines For Tirupati Darshan to Locals: ఈ మంగళవారం నుంచే వారికి శ్రీవారి దర్శనం, ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసిన టీటీడీ
సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో 500 దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారని వివరించారు. టోకెన్లను ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జారీ చేయనున్నామని చెప్పారు
Tirupati, DEC 01: ప్రతినెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుమల(Tirumala), తిరుపతి (Tirupati) స్థానికులకు టీటీడీ (TTD) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈనెల డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం (Darshan) కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో 500 దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారని వివరించారు. టోకెన్లను ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జారీ చేయనున్నామని చెప్పారు. ముందుగా వచ్చినవారికి తొలి ప్రాధాన్యతతో టోకెన్లు కేటాయిస్తారని, స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఫుట్‌పాత్ హాల్ క్యూలైన్ లో భక్తులను దర్శనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారని వివరించారు. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు.