కొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా వారిలో ఆరోగ్య సమస్యలు గొడవలు డబ్బు నష్టం వాటి సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. వారు ఇంటి వాస్తును ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ని తీసివేయడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపరడమే కాకుండా కుటుంబంలో సంతోషం డబ్బుపరంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా సానుకూల ప్రభావాలు ఉండడానికి ఇక్కడ కొన్ని పరిష్కారాలు గురించి తెలుసుకుందాం..
ముళ్ళ చెట్లు పెంచకూడదు- కొంతమంది ఇంటి చుట్టూ స్నేక్ ప్లాంట్, అలోవెరా అకేసియా, వంటి చెట్లను నాటుతూ ఉంటారు. ఇది దీని వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. మీరు ఇంటి దగ్గర ఇటువంటి చెట్ల పెంచినట్లయితే వెంటనే వాటిని తొలగించడం మంచిది. వీటి బదులు మీరు మంచి పూలు మంచి కాయలు ఉన్న పచ్చని చెట్లను నాటండి.
ఈశాన్యంలో బరువులు పెట్టకండి- ఈశాన్యాని బ్రహ్మస్థానం అంటారు. ఇది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం. ఇది ఇంటి మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ స్థలాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఖాళీగా ఉంచాలి. ఈ ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బరువైన వస్తువులు ఇక్కడ ఉంచకూడదు. దీనివల్ల సానుకూల శక్తి పోతుంది. కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ స్థలంలో దీపాలు లేదా పువ్వులను ఉంచడం మంచిది.
నీరు వృధాగా పోకూడదు- నీటి లీకేజీ ఆర్థిక నష్టానికి చిహ్నంగా చెప్తూ ఉంటారు. ఇంట్లో నీరు లీక్ అవుతున్న లేదా ప్లంబింగ్ సమస్యలు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించడం మరిచిపోవద్దు వాస్తు దోషాలను సరి చేయడమే కాకుండా నీటి వృధా అని కూడా అరికట్టాలి. ఇలా చేయడం వల్ల సంపద ఆరోగ్యం రెండిటికి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
నిత్యం దీపారాధన చేయండి- ఇల్లును ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం దీపారాధన చేయడం ధూపం అగరవత్తులు, కర్పూరం వంటివి వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది. ఇంటి వాతావరణం శుభకరంగా మారుతుంది. ఇది కుటుంబ సభ్యుల మానసిక ,శారీరక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.