COVID-19 Third Wave: ప్రజల నిర్లక్ష్యం, 6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్ వేవ్, పాజటివ్ కేసులు 5 శాతం దాటితే వెంటనే మినీ లాక్ డౌన్ పెట్టాలని సూచించిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రందీప్ గులేరియా

కోవిడ్‌ మొదటి వేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తించి భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో థర్డ్‌వేవ్‌ వ్యాపించడం (Third Covid Wave Likely To Hit India) అనివార్యమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రందీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.

Dr Randeep Guleria, Director AIIMS (Photo Credits: ANI/Twitter)

New Delhi, June 19: కరోనా వైరస్‌ సెంకడ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కోవిడ్‌ మొదటి వేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తించి భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో థర్డ్‌వేవ్‌ వ్యాపించడం (Third Covid Wave Likely To Hit India) అనివార్యమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రందీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఆరు నుంచి ఎనిమిది వారాల్లో థర్డ్ వేవ్ వస్తుందని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధిపతి డాక్టర్ రణ్ దీప్ గులేరియా (Dr Randeep Guleria) అన్నారు

ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 6 నుంచి 8 వారాల్లో కోవిడ్‌ మూడో వేవ్‌ (COVID-19 Third Wave) విరుచుకుపడే అవకాశం ఉందని, అన్‌లాక్‌తో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, వైరస్ అంటేనే మ్యుటేషన్లకు గురవుతూ ఉంటుందని తెలిపారు. హాట్‌స్పాట్లలో తగిన నిఘా అవసరమని పేర్కొన్నారు. దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కోవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ మధ్య అంతరం తగ్గించడం సవాల్‌గా మారిందని ఆయన వివరించారు. కరోనా మొదటి, రెండో వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో తెలుసు‍​​కోవాలన్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్‌లాక్‌ చేయడంతో కనీస కోవిడ్‌ నిబంధనల కూడా పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని తెలిపారు. ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరిగి, కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ రావటం ఖాయమని డాక్టర్ రందీప్ గులేరియా హెచ్చరించారు.

దేశంలో 74 రోజులు తరువాత అత్యంత తక్కువగా కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 60,753 మందికి కోవిడ్, ప్రస్తుతం 7,60,019 యాక్టివ్‌ కేసులు, కొవిడ్‌-19 టీకా డ్రైవ్‌లో మరో మైలురాయిని అధిగమించిన భారత్

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి ప్రజలెవరూ ఇంకా గుణపాఠం నేర్చుకోనట్టున్నారన్నారు. ఇప్పుడు కూడా జనం గుమికూడుతున్నారని, భౌతిక దూరం, మాస్క్ వంటి నిబంధనలేవీ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించడంపైనే థర్డ్ వేవ్ ఆధారపడి ఉందన్నారు. మూడో వేవ్ వస్తే మూడు నెలల పాటు ఉంటుందన్నారు. పాజటివ్ కేసులు 5 శాతం దాటితే వెంటనే మినీ లాక్ డౌన్లు పెట్టాలని సూచించారు.

వ్యాక్సినేషన్ వేగం పుంజుకోకుంటే ముప్పు ఎక్కువ అవుతుందన్నారు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం చెడ్డ నిర్ణయమేమీ కాదని, అదీ మంచిదేనని అన్నారు. దాని వల్ల వీలైనంత ఎక్కువ మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా వేయడానికి అవకాశం దొరుకుతుందన్నారు.డెల్టా వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై మాట్లాడుతూ కరోనా మ్యుటేషన్లపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కొత్త విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటిపై వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేయాలన్నారు.

ఇక లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రజలు భారీగా బయటకు వస్తుండటంతో.. మహారాష్ట్రకు థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని ప్రభుత్వం నియమించిన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. గత వేరియంట్ల కంటే రెట్టింపు వేగంతో వ్యాపించే డెల్టా ప్లస్‌  కారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లోనే ఇందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు కమిటీ నివేదించింది. మహారాష్ట్రలో ఫస్ట్‌ వేవ్‌లో 19 లక్షలు, సెకండ్‌ వేవ్‌లో 40 లక్షల కేసులు నమోదయ్యాయి.

థర్డ్‌ వేవ్‌ కనుక వస్తే దాదాపు 80 లక్షల మంది ప్రజలు వైరస్‌ బారినపడతారని హెచ్చరించింది. యాక్టివ్‌ కేసులు 8 లక్షలకు చేరతాయని.. ఇందులో పది శాతం మంది పిల్లలు ఉండొచ్చని పేర్కొంది. కాగా.. దేశంలో బుధవారం 67,208 మంది వైరస్‌ నిర్ధారణ అయింది. కరోనాతో మరో 2,330 మంది చనిపోయారు. కొత్తగా 1.03 లక్షల మంది కోలుకున్నారు. ఒక్క రోజులో 38,600 యాక్టివ్‌ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 8.26 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. గత 71 రోజుల్లో ఇవే అత్యల్పం.

మూడు రోజుల్లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 56.70 కోట్ల టీకాలను పంపిణీ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్‌)లో చేర్చాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌ సమర్పించిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని (ఈఓఐ) డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించింది. అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం లభిస్తే కొవాగ్జిన్‌కు పెద్ద విజయం అవుతుంది. పిల్లలపై కొవొవ్యాక్స్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలు, రవాణా సదుపాయాలు సరిగా లేని ప్రదేశాలకు డ్రోన్ల ద్వారా టీకాలు చేరవేసేందుకు కేంద్రం బిడ్లను ఆహ్వానించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif