Trainman App Trip Assurance Feature: మీ ట్రైన్ టికెట్ వెయింటింగ్ లిస్ట్‌లో ఉందా? అయితే మీకు ఫ్రీగా ఫ్లైట్ టికెట్ వస్తుంది! ఈ యాప్‌తో అసలు వెయింటింగ్ లిస్ట్ టెన్షన్ ఉండనే ఉండదు

యాప్ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను చూపే ప్రిడిక్షన్ మీటర్‌ను చూపిస్తుంది. చార్ట్ తయారీకి ముందు టిక్కెట్‌లు కన్ఫర్మ్ కాకపోతే.. ట్రిప్ అస్యూరెన్స్ (Trip Assurance) ప్రయాణీకులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ప్రయాణ ఆప్షన్లను ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు.

Trainman App New Feature

New Delhi, NOV 25: చివరి నిమిషంలో దూర ప్రయాణాలు చేయాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరం ట్రైన్ జర్నీకే (Train Journey) ప్రాధాన్యత ఇస్తాం. కానీ టికెట్లు వెయిటింగ్ లిస్ట్ లో పడటం, బుకింగ్ కాకపోవడంతో చాలామంది సమస్యలు ఎదుర్కుంటుంటారు. చాలా సందర్భాలలో ఒక వెయిటింగ్ రైలు టికెట్ కన్ఫర్మ్ (Ticket Confirm) అయినా.. వారాంతాల్లో లేదా రద్దీగా ఉండే ప్రయాణ తేదీలలో ప్రయాణీకులకు సీట్లు లభించవు. చివరి నిమిషంలో ప్లాన్‌లను మార్చుకోవలసి ఉంటుంది. దీని కారణంగా రైల్వే ప్రయాణీకులకు సాయం చేసేందుకు టికెట్ బుకింగ్ యాప్ – ట్రైన్‌మ్యాన్ (Trainman) కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా కంపెనీ రైలు ప్రయాణాలకు ఆఫర్ అందిస్తోంది. ఒకవేళ రైలు టికెట్ కన్ఫర్మ్ కానట్లయితే.. ప్రయాణీకులకు సాయపడేందుకు కంపెనీ ఉచితంగా విమాన టిక్కెట్లను ఏర్పాటు చేస్తుంది. ట్రైన్‌మ్యాన్ యాప్ ‘Trip Assurance’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ రైలు ప్రయాణీకులకు, వెయిట్‌లిస్ట్‌లో (Waitlist) టిక్కెట్‌లతో సులభంగా ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవచ్చు. ట్రైన్‌మ్యాన్ యాప్‌ ద్వారా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే ఎవరైనా యాప్‌లోనే తమ టిక్కెట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు.

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నారా.. అయితే టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు గురించి మీరు తెలుసుకోవాల్సిందే 

ఒకవేళ ప్రయాణీకుడు ధృవీకరించిన రైలు టిక్కెట్‌ను పొందనట్లయితే.. యాప్ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను చూపే ప్రిడిక్షన్ మీటర్‌ను చూపిస్తుంది. చార్ట్ తయారీకి ముందు టిక్కెట్‌లు కన్ఫర్మ్ కాకపోతే.. ట్రిప్ అస్యూరెన్స్ (Trip Assurance) ప్రయాణీకులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ప్రయాణ ఆప్షన్లను ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు. యాణీకుల టిక్కెట్ ప్రిడిక్షన్ మీటర్ 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ అని సూచిస్తే.. యాప్ ట్రిప్ అస్యూరెన్స్ రుసుం రూ. 1 వసూలు చేస్తుంది. ఒకవేళ శాతం 90 శాతం కన్నా తక్కువగా ఉంటే.. టిక్కెట్ క్లాసును బట్టి కంపెనీ నామమాత్రపు రుసుమును వసూలు చేస్తుంది. ముఖ్యంగా, చార్ట్ ప్రిపరేషన్ సమయంలో రైలు టికెట్ కన్ఫర్మ్ అయినట్లయితే.. ట్రిప్ అస్యూరెన్స్ రుసుం కస్టమర్‌లకు రీఫండ్ చేస్తుంది.

IRCTC New Rules: రైల్వే టికెట్‌ బుకింగ్‌ కొత్త రూల్స్, రెండో రిజర్వేషన్‌ చార్ట్‌‌లో పలు మార్పులు, ఇకపై రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధం 

అయితే, టికెట్ కన్ఫర్మ్ కానట్లయితే.. రైల్వే ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు ట్రైన్‌మ్యాన్ ప్రయాణీకుడికి ఉచిత విమాన టిక్కెట్‌ను అందజేస్తుంది. ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్ ప్రస్తుతం అన్ని IRCTC రాజధాని రైళ్లలో దాదాపు 130 ఇతర రైళ్లలోనూ ఈ సర్వీసులను అందిస్తోంది. కంపెనీ ప్రకారం.. ట్రైన్‌మ్యాన్ యాప్ మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త ఎరా టెక్నాలజీని ఉపయోగిస్తుంది. IRCTCకి అధీకృత భాగస్వామిగా పనిచేస్తుంది. IRCTC ప్రయాణీకులకు ఇబ్బంది లేని ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్‌ను అందిస్తోంది.

వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్‌లను కన్ఫర్మ్ చేసిన టిక్కెట్‌లుగా మార్చడానికి రైలు అంచనా మోడల్ 94 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే.. కంపెనీ ఉచితంగా విమాన టిక్కెట్‌ను అందిస్తుంది. అయితే, ‘Trip Assurance’ సౌకర్యం విమానాశ్రయాలు ఉన్న నగరాలకు మాత్రమే వర్తిస్తుంది. రైలు టిక్కెట్ కన్ఫర్మ్ అయినప్పుడు.. ‘Trip Assurance’ కింద విమాన టిక్కెట్‌ను అందిస్తోంది. అయితే, విమానాశ్రయాలను కలిగి ఉన్న నగరాలకు మాత్రమే వర్తిస్తుంది.