Zika Virus in Kerala: కరోనాకు తోడయిన జికా వైరస్, కేరళలో రోజు రోజుకు పెరుగుతున్న Zika Virus కేసులు, ఆదివారం కొత్తగా 3 కేసులు నమోదు కావడంతో 18కి చేరిన జికా కేసుల సంఖ్య, అలర్ట్ అయిన కేరళ సర్కారు

తాజాగా మరో మూడు జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 18కి (total count moves to 18) పెరిగింది.

Zika Virus (Photo Credits: Flicr)

Thiruvananthapuram, July 12: కేరళ రాష్ట్రంలో ఓ వైపు కరోనా కేసులు మరో వైపు జికా వైరస్ (Zika Virus in Kerala) కలవరం సృష్టిస్తోంది. తాజాగా మరో మూడు జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 18కి (total count moves to 18) పెరిగింది. 22 ఏళ్ల యువకుడు, 46 ఏళ్ల వ్యక్తి, మరో 29 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త జికా వైరస్ బారిన పడ్డారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు. జికా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తిరువనంతపురం, త్రిస్సూర్, కోజికోడ్ మెడికల్ కళాశాలలు, అల్లప్పుజా వైరాలజీ ఇన్ స్టిట్యూట్ లలో జికా వైరస్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వీణా చెప్పారు.

ఆదివారం 35 శాంపిళ్లను పరీక్షించగా మూడు జికా వైరస్ (Zika Virus) కేసులు వెలుగుచూశాయని మంత్రి చెప్పారు. పూణే నగరంల నుంచి 2,100 టెస్ట్ కిట్లు వచ్చాయని, వీటిని తిరువనంతపురం, అల్లప్పుజా, త్రిస్సూర్, కోజికోడ్ లకు పంపించామని కేరళ వైద్యాధికారులు చెప్పారు.జ్వరం, రాషెష్, ఒళ్లు నొప్పులుంటే వారికి జికా వైరస్ పరీక్షలు చేయాలని మంత్రి ఆదేశించారు.ఆరుగురు నిపుణులతో కూడిన కేంద్ర వైద్యుల బృందం జికా వైరస్ పరిశీలన కోసం కేరళ రాష్ట్రంలో పర్యటించింది.

కలవరపెడుతున్న థర్డ్ వేవ్ ముప్పు, మహారాష్ట్రలో 8 జిల్లాల్లో కరోనా డేంజర్ బెల్స్, దేశంలో తాజాగా 37,154 మందికి కోవిడ్, ప్ర‌స్తుతం 4,50,899 యాక్టివ్ కేసులు

గత ఏడాది కరోనాను నియంత్రించడంలో ‘మోడల్‌’గా మారిన కేరళలో ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజుకు 12-15 వేల మధ్య కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇంతవరకు మొత్తం 30.39 లక్షల కేసులు నమోదైన రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,13,115కి చేరింది. పలు కొవిడ్‌ నిబంధనలను సడలించడం (అన్‌లాక్‌) వల్లే కేసులు పెరుగుతున్నాయని.. క్రమేపీ తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ చెబుతున్నారు.

జికా వైరస్‌ లక్షణాలు ఏంటి, శరీరంలో జికా వేటిపై ప్రభావం చూపుతుంది, Zika Virus ఎలా వ్యాపిస్తుంది, పూర్తి సమాచారం మీకోసం

కేరళలో కొవిడ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 1న 19,760 రోజువారీ కేసులు నమోదు కాగా వారం రోజుల్లో ఆ సంఖ్య 9,313కి తగ్గింది. మళ్లీ రెండు రోజులకే 16,204కి పెరిగింది. నెల రోజుల తర్వాత కూడా (జులై 11న) 14 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. అయితే కేసుల సంఖ్య వైద్య వసతులపై ఒత్తిడి పెంచేస్థాయిలో లేకపోవడం వల్ల మహమ్మారిపై పోరాడగలుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.