Thyrocare Survey: భారత్‌లో 18 కోట్ల మందికి కరోనా భయమే లేదు, వారి శరీరం కోవిడ్-19 రోగనిరోధక శక్తిని కలిగి ఉంది, థైరోకేర్‌ సర్వేలో వెల్లడి

దీనికి ప్రధాన కారణం వారంతా ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా (Thyrocare Survey) పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కోవిడ్-19 వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ (Antibodies Against Coronavirus) కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని సర్వే తెలియజేసింది.

Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, July 23: భారత్‌లో 18 కోట్ల మందికి (18 crore Indians) కరోనా భయమే లేదు. దీనికి ప్రధాన కారణం వారంతా ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా (Thyrocare Survey) పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కోవిడ్-19 వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ (Antibodies Against Coronavirus) కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని సర్వే తెలియజేసింది. నెగిటివ్ వచ్చిన 12 మందికి మళ్లీ పాజిటివ్, మధ్యప్రదేశ్ గవర్నరు అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రికి కరోనా, మ‌ణిపూర్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్, దేశంలో 12 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు

దేశంలోని 600 ప్రాంతాల్లో 60 వేల మందిపై సుమారు 20 రోజుల పాటు ఈ సంస్థ యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించింది. దేశంలో దాదాపు 15 శాతం మందిలో ఇప్పటికే ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందినట్లు తెలుస్తోందని స్టడీ తెలిపింది. ఈ విషయాన్ని థైరోకేర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ వెలుమని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తమ అంచనాల్లో 3శాతం అటూఇటుగా ఉండవచ్చని పేర్కొన్నారు.

Here's What Said Thyrocare Director:

థైరోకేర్ డేటా ప్రకారం, యాంటీబాడీలను అభివృద్ధి చేసుకున్న జాబితాలో థానేలోని బివాండీ టాప్ లో ఉంది. ఆ తర్వాత బెంగుళూరులోని పీణ్య ఉందని సర్వే తెలిపింది. ఒకసారి శరీరంలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందితే వారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ప్రైవేట్ ల్యాబ్‌ థైరోకేర్ 60,000 పరీక్షలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో ఆ ఆసక్తికరమైన విషయం వెల్లడయ్యింది.

వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. కాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశంలో కోవిడ్‌-19కు సంబంధించి రెండు రకాల పరీక్షలను ఆమోదించింది. అవి ఆర్‌టీ- పీసీఆర్‌ పరీక్షలు, యాంటీబాడీ పరీక్షలు. ఈ పరీక్షలను ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా నిర్వహించవచ్చు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif