Tirumala Tirupati Temple: తిరుమల కొండపై మద్యం తాగుతూ, చికెన్ తింటూ.., 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్‌, తిరుమల నోటిఫై ఏరియా చట్టం కింద కేసు నమోదు

కష్టాలు, బాధలను మర్చిపోయి దేవుడు సేవలో మైమరిచిపోవాలని కోరుకుంటారు. అలాంటి చోట ఆకతాయిలు మరీ పేట్రేగిపోతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తూ వస్తున్నారు. తాజాగా తిరుమల కొండపై (Venkateswara Temple) కూడా మద్యం తాగుతూ, మాంసం తింటూ కొందరు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు.

File image of Tirupati Balaji Temple | (Photo Credits: PTI)

Amaravati, Mar 07: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు (Tirumala) అందరూ దైవ దర్శనం కోసం వెళుతుంటారు. కష్టాలు, బాధలను మర్చిపోయి దేవుడు సేవలో మైమరిచిపోవాలని కోరుకుంటారు. అలాంటి చోట ఆకతాయిలు మరీ పేట్రేగిపోతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తూ వస్తున్నారు. తాజాగా తిరుమల కొండపై (Venkateswara Temple) కూడా మద్యం తాగుతూ, మాంసం తింటూ కొందరు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు.

తిరుమలపై మద్యం తాగుతూ, మాంసం తింటున్న 14 మందిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక బాటగంగమ్మ ఆలయం దగ్గర్లో కొందరు యువకులు చికెన్ బిర్యానీ. అలాగే మాంసం తింటూ... మద్యం తాగుతున్నట్లు ( Eating chicken, consuming liquor) పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లారు.

వాళ్ల వాహనాన్ని గుర్తించిన ఆ యువకులు పరిగెత్తడానికి ప్రయత్నించగా.. పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. ఆ 14 మందిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్‌తో పాటు తిరుమల నోటిఫై ఏరియా చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని టీటీడీ అశ్వినీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు.

ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ తిరుమలపై ఎవరైనా కనిపించినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు మరోసారి హెచ్చరించారు.