Vice-President Polls: విపక్ష పార్టీలకు మమతా బెనర్జీ షాక్, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా టీఎంసీ ఎంపీలు, నిర్ణయం ప్రకటించిన పార్టీ జనరల్ సెక్రటరీ, మమ్మల్ని సంప్రదించకుండానే క్యాండిడేట్ ఎంపిక అంటూ ఆగ్రహం
ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని (abstain) మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్‌సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ (Abishek benarjee) గురువారం వెల్లడించారు.
Kolkata, July 22: రాబోయే ఉప రాష్ట్రపతి ( vice-president polls) ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని (abstain) మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్‌సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ (Abishek benarjee) గురువారం వెల్లడించారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamatha benarjeee) పార్టీ ఎంపీలతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (vice-president polls) పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు.
విపక్షాల అభ్యర్థిగా ఉన్న మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేసేముందు ప్రతిపక్షాలు తమను సంప్రదించకపోవడంతో టీఎమ్‌సీ (TMC) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి మార్గరెట్ ఆల్వాతో (Margaret Alva) మమతకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే, ఈ విషయంలో ముందుగా తమ పార్టీ అభిప్రాయం అడగకపోవడం మమతకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంలో ఆమె ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్(congress), ఎన్సీపీలపై (NCP) ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి ఎంపిక తమను సంప్రదించకుండా జరిగిందని, ఈ పద్ధతి సరికాదని టీఎమ్‌సీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. గత ఆదివారం మార్గరెట్ ఆల్వా ఎంపిక జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిపి మొత్తం 18 పార్టీలు సమావేశమై ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే, ఇందులో
టీఎమ్‌సీకి ఆహ్వానం అందలేదు.
ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీ టీఎమ్‌సీ. ఈ పార్టీకి లోక్‌సభలో 23 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 53 మంది ఎంపీలు ఉంటే, తమిళనాడుకు చెందిన డీఎమ్‌కేకు 24 మంది ఎంపీలు ఉన్నారు. ఆ తర్వాత వైసీపీకి 22 మంది ఎంపీలున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎక్కువ మంది ఎంపీలున్న టీఎమ్‌సీ తప్పుకోవడం ఆ కూటమికి ఎదురుదెబ్బే. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మద్దతు ఇవ్వాలి అని కోరేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నా మమతా బెనర్జీ అందుబాటులోకి రావడం లేదు.