( Photo-Twitter)

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము (NDA Presidential Candidate Droupadi Murmu) నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో (President Election 2022 Result) బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన #ద్రౌపది ముర్ముకి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా శుభాకాంక్షలు తెలిపారు.

Here's Tweet

భారతదేశ కొత్త చరిత్ర. 1.3 బిలియన్ల మంది భారతీయులు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న సమయంలో, తూర్పు భారతదేశంలోని మారుమూల ప్రాంతంలో జన్మించిన గిరిజన సమాజానికి చెందిన భారతదేశపు కుమార్తె మన రాష్ట్రపతిగా ఎన్నికైంది! శ్రీమతి గారికి అభినందనలు. అంటూ ట్వీట్ చేశారు.