Coronavirus in India: దేశ వ్యాప్తంగా 11 వేల మందికి పైగా డిశ్చార్జ్, 42 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, 1300 దాటిన మరణాలు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్ 3.0
కేసుల సంఖ్య 42 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరింది. మరోవైపు దేశంలో ఒక్కరోజే 83 మంది (Coronavirus Deaths) వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,373కుకు చేరినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 11,706 మంది (coronavirus cases) కొవిడ్-19 బారి నుంచి కోలుకున్నారని, 29,453 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్-19 మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉన్నదని వెల్లడించింది.
New Delhi, May 4: దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus in India) ఉద్ధృతి కొనసాగుతున్నది. కేసుల సంఖ్య 42 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 42,263కు చేరింది. మరోవైపు దేశంలో ఒక్కరోజే 83 మంది (Coronavirus Deaths) వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,373కుకు చేరినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే
ఇప్పటి వరకు 11,706 మంది (coronavirus cases) కొవిడ్-19 బారి నుంచి కోలుకున్నారని, 29,453 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్-19 మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉన్నదని వెల్లడించింది.
దేశంలో కరోనా మరణాలు రేటు 3.2 శాతంగా ఉన్నదని.. ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. గత 14రోజుల కిందట కేసుల రెట్టింపు 10.5 రోజులు ఉండగా.. ప్రస్తుతం 12 రోజులకు చేరిందన్నారు. ఇప్పటివరకు దేశంలో 10,46,450 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. కోవిడ్-19 పోరాట యోధులకు అరుదైన గౌరవం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశం నుంచి పూలవర్షంతో భారత వాయుసేన వందనం, దేశవ్యాప్తంగా స్పూర్థిని రగిల్చిన దృశ్యం
ఇదిలా ఉంటే సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 3.0 మొదలుకానున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరికొన్ని ఆంక్షల్ని సడలించాయి. ఇందులో మద్యం దుకాణాలకు అనుమ తినివ్వడం, పెండ్లి వేడుకలకు 20 మందికి పైగా, అంత్యక్రియలకు 20 మందిని అనుమతించడం, అత్యవసర సరుకుల రవాణాకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి, కార్లలో ఇద్దరు లేదా ముగ్గురు, ద్విచక్ర వాహనంపై ఒక్కరికి అనుమతినివ్వడం వంటివి ఉన్నాయి. పోలీస్ శాఖలో కరోనా కల్లోలం, ముంబై పోలీసుల్లో 100 మందికి పైగా కోవిడ్-19 పాజిటివ్, దేశ వ్యాప్తంగా 35 వేలు దాటిన కరోనావైరస్ కేసులు
ముంబైలోని ధారావిలో గత 24 గంటల్లో 94 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. దీంతో ధారావిలో కరోనా సోకిన వారి సంఖ్య 590 కి చేరుకోగా, ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మహారాష్ట్రలో కొన్ని షరతులతో రెడ్ జోన్లలోనూ దుకాణాలు తెరవనున్నారు. ఎక్కడ షాపులు తెరిచినా, సామాజిక దూరాన్ని పూర్తిగా పాటించాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా దుకాణాలను తెరిచే సమయాన్ని స్థానిక అధికారులు నిర్ణయిస్తారు. అయితే ఈ వెసులుబాటు ముంబై, పూణే నగరాలకు వర్తించదు.