Tractor Rally: దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, కిసాన్ పరేడ్ కోసం ఢిల్లీలోకి ప్రవేశించిన వేలాది మంది రైతులు, మరోవైపు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు
మంగళవారం ఉదయాన్నే పోలీసులు పెట్టిన బారికేడ్లను తొలగించి వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ (Police Use Tear Gas as Agitating Farmers) ప్రయోగించారు.
New Delhi, Jan 26: గణతంత్ర వేడుకలు దేశమంతా కనుల విందుగా సాగుతుంటే ఢిల్లీలో రైతులు జాతీయ జెండాలు పట్టుకుని నిరసన బాట పట్టారు. నాగలితో పాటు జాతీయ జెండా చేత పట్టి ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో గణతంత్ర వేడుకలు జరుగుతుండగా... అదే ఢిల్లీ శివారులో లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ (Tractor Rally) చేపట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనగా.. దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరసన చేపడుతున్నారు. గత 62 రోజులుగా పోరాటం చేస్తున్నారు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన కిసాన్ పరేడ్ (Kisan Parade) ఉద్రిక్తంగా మారింది. మంగళవారం ఉదయాన్నే పోలీసులు పెట్టిన బారికేడ్లను తొలగించి వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ (Police Use Tear Gas as Agitating Farmers) ప్రయోగించారు. నిజానికి రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత రైతులు తమ ట్రాక్టర్ పరేడ్ చేపట్టడానికి అనుమతి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉదయం 8 గంటలకే సరిహద్దులు దాటి ఢిల్లీలోకి దూసుకువచ్చారు.
Here's Farmers Protest Visuals
సింఘు, టిక్రీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది జెండాలను పట్టుకొని కనిపించారు. కొందరు ట్రాక్టర్లపై ఢిల్లీలోకి ప్రవేశించారు. కనిపించిన పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. పాండవ్ నగర్ దగ్గర్లో ఢిల్లీ, మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. అటు ముకర్బా చౌక్‌లోనూ బారికేడ్లను తొలగించి పోలీసుల వాహనంపై ఎక్కారు. సంజయ్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోనూ పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతా సిబ్బందిని మోహరించారు.6వేల మంది సాయుధ పోలీసులతో పహరా ఏర్పాటు చేశారు.
అయితే రైతుల ఉద్యమాన్ని (Farmers Protest) ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాదాపు 10 విడతలు చర్చలు చేసినా ఎలాంటి ఫలితం లేదు. చర్చలకు పిలుస్తారు.. రైతులకు అడిగిన వాటికి కుదరదని తేల్చి చెప్పేస్తారు. దీంతో పదిమార్లు విడతలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఈ విషయంలో రైతులు ఒక్క మెట్టు కూడా దిగడం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకు ఇంకోటి అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
అబ్బురపరిచేలా సైనిక విన్యాసాలు, రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కానున్న రఫేల్ యుద్ధ విమానాలు
దీంతో చివరకు కేంద్రం ఒక మెట్టు దిగి సుప్రీంకోర్టు సలహా ప్రకారం ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాల రద్దును వాయిదా వేస్తామని ప్రకటించింది. దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పగా రైతులు అంగీకరించలేదు. తాత్కాలికంగా తమ ఉద్యమాన్ని ఆపేందుకు కేంద్రం ఈ ప్రతిపాదన చేసిందని.. తక్షణమే ఆ చట్టాలను రద్దు చేస్తేనే కానీ తాము ఆందోళనలు విరమించమని తేల్చి చెబుతున్నారు.