New Law on Hit-and-Run Cases: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన హిట్-అండ్-రన్ నిబంధన ఏమిటీ? డ్రైవర్లు ఎందుకంతగా వ్యతిరేకిస్తున్నారు, భారతీయ న్యాయ సంహిత చట్టంపై పూర్తి కథనం ఇదిగో..
కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS)కి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల దేశవ్యాప్త ఆందోళన తీవ్రతరం కావడంతో, వివిధ రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపులు భారీ క్యూలను చూస్తున్నాయి.
Truck Drivers Protest Against BNS: కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS)కి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల దేశవ్యాప్త ఆందోళన తీవ్రతరం కావడంతో, వివిధ రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపులు భారీ క్యూలను చూస్తున్నాయి. డిమాండ్‌లో ఈ పెరుగుదల ఇంధన ధరల పెంపును ఊహించి కాదు కానీ కొనసాగుతున్న ట్రక్కర్‌ల నిరసన ఇంధన సరఫరా గొలుసుకు అంతరాయం కలిగిస్తుందనే భయాలను పెంచుతుంది. నిరసనలు కొనసాగితే నిత్యావసర సరుకులకు కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జనవరి 2న దేశ వ్యాప్త సమ్మె, పెట్రోల్ కోసం బంకుల వద్ద కిక్కిరిసిపోయిన వాహనాలు, వీడియోలు ఇవిగో..
బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి, ప్రధానంగా కొత్త BNS కింద హిట్ అండ్ రన్ ప్రమాదాలకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.మహారాష్ట్రలో, ట్రక్కర్లు సోమవారం అనేక ప్రదేశాలలో 'రాస్తారోకో' నిరసనలు నిర్వహించారు, ప్రధానంగా ఇటీవల అమలులోకి వచ్చిన శిక్షా చట్టంలో హిట్ అండ్ రన్ నిబంధన ప్రకారం వాహనదారులకు తీవ్రమైన జరిమానాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసనలు చేపట్టారు. పెండింగ్ చలానాలు ఈ వెబ్‌సైట్‌లో కడుతున్నారా, అయితే మీ డబ్బులు పోయినట్లే, అలర్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయి ?
న్యాయ వ్యవస్థలో మార్పుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధన ట్రక్కు డ్రైవర్ల (Truck drivers strike) ఆగ్రహానికి కారణమయ్యింది.త్వరలో అమల్లోకి రానున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు రోజులపాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు, పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లు, హింసాత్మక ఘటనలు, లాఠీఛార్జీలకు దారితీశాయి.
భారతీయ న్యాయ సంహిత చట్టం ఏం చెబుతోంది..?
కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) చట్టం ప్రకారం.. హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. ఇందులోని సెక్షన్ 104లో రెండు నిబంధనలపై (Clauses) డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ శిక్షాస్మృతి (IPC)లో ఇవి సెక్షన్ 304ఏ కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఐపీసీలో గరిష్ఠంగా రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది. అయితే మారిన నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. వాటిని ఓ సారి చూస్తే..
మొదటి నిబంధన: నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని మొదటి నిబంధనలో పేర్కొన్నారు.
రెండవ నిబంధన: రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడ నుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ఈ నిబంధనలపై డ్రైవర్లు ఏమంటున్నారు..?
‘హిట్ అండ్ రన్’ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ జైలు శిక్ష పడితే పదేళ్లపాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ స్థాయిలో (రూ.7లక్షల) జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతోపాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండు చేస్తున్నాయి.
కేంద్రం స్పందన ఏమిటంటే..
ట్రక్ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రాత్రి 7 గంటలకు డ్రైవర్ల యూనియన్ తో చర్చలు జరుపనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)