RTC Chalo Tank Bund: ఛలో ట్యాంక్‌బండ్‌తో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం,పోలీసుల అదుపులో అశ్వత్థామరెడ్డి, పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిఘా నీడలో ట్యాంక్‌బండ్

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ఛలో ట్యాంక్ బండ్ పిలుపుతో ట్యాంక్‌బండ్‌ పైకి భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

TSRTC To Conduct Chalo Tank Bund March (Photo-Twitter)

Hyderabad, November 9: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్‌బండ్‌’(Chalo Tank Bund)కు ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్‌(Hyderabad)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ (RTC JAC) ఇచ్చిన ఛలో ట్యాంక్ బండ్ పిలుపుతో ట్యాంక్‌బండ్‌ పైకి భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకొని ఆందోళనకారులు ట్యాంక్‌బండ్‌పైకి దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ట్యాంక్ బండ్‌ (TankBund)పై భారీగా మోహరించారు. ట్యాంక్ బండ్‌కు వచ్చే అన్ని దారుల్ని మూసివేశారు.

ఆందోళనకారులు ట్యాంక్‌బండ్‌పైకి

మరోవైపు ఓయూ వద్ద కూడా భారీగా భద్రతా బలగాలు మోహరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు టాంక్‌బండ్‌వైపు దూసుకొస్తారన్న అనుమానంతో ముందుగానే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్‌ చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌పై ప్రశాంత వాతావరణం ఉందని సీపీ తెలిపారు.

జితేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇదిలా ఉంటే.. అయోధ్య(Ayodhya)పై సుప్రీంకోర్టు నేపథ్యంలోనూ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అంజనీకుమార్ తెలిపారు. అంతేకాకుండా సున్నిత ప్రదేశాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు.

పోలీసుల అదుపులో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు పిలుపునిచ్చిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్వత్థామతో పాటు పలువురు జేఏసీ నేతలను సైతం పీఎస్‌కు తరలించారు.

వందలాది మంది ఆర్టీసీ కార్మికులను, కార్మిక సంఘాల నేతలను ఒక రోజు ముందుగానే అరెస్టు చేసినా, టాంక్‌బండ్‌కు దారితీసే రోడ్లన్నింటిపై బారికేడ్లు, ముళ్ళకంచెలను ఏర్పాటు చేసినా కొద్దిమంది కార్మికులు దూసుకొచ్చారు. వారిని బారికేడ్ల దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా బుద్ధ భవన్ దగ్గర సుమారు ముప్పై మంది ఆర్టీసీ కార్మికులు ట్యాంక్‌బండ్ రోడ్డుపై అడుగు పెట్టగానే వారిని కూడా అరెస్టు చేశారు.

కార్మికుల అరెస్ట్ 

ట్యాంక్ బండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే అన్ని రహదారులను మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాకపోకలను నిషేధించారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను కవాడిగుడా వైపు మల్లించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్కువైపు వచ్చే వాహనాలు అశోక్ నగర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు. హిమాయత్ నగర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు బషీర్ బాగ్ వైపు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనదారులు పీసీఆర్ జంక్షన్ దగ్గర దారి మల్లించారు. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ వైపు మల్లించిన ట్రాఫిక్ పోలీసులు.. సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం