TTD Free Darshan Tokens: శ్రీనివాసుడి భక్తులకు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టికెట్లు, ఈ నెల 15 నుంచి ప్రతిరోజు 15వేల టోకెన్లు
కరోనా కారణంగా నిలిచిపోయిన సర్వ దర్శనం టోకెన్ల జారీని (free darshan tokens) పునరుద్దరించాలని నిర్ణయించింది టీటీడీ. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్ లో(offline) కూడా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ (TTD)టోకెన్లు జారీ చేయనుంది.
Tirupati, Feb 13: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా నిలిచిపోయిన సర్వ దర్శనం టోకెన్ల జారీని (free darshan tokens) పునరుద్దరించాలని నిర్ణయించింది టీటీడీ. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్ లో(offline) కూడా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ (TTD)టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతిలోని (Tirupati) భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది. ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం(Special darshan), వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ మేరకు రోజుకు 25వేల నుంచి 30 వేల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
ప్రతిరోజు 15వేల సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చెయ్యాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాలలో టోకెన్లు జారీ చేయనుంది. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసింది. గత ఏడాది రోజుకు 2వేల చొప్పున టికెట్లు జారీ చేసినా.. భక్తుల రద్దీ దృష్ట్యా నిలిపేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే రోజుకు 5వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కూడా దాదాపు వందశాతం పూర్తవడంతో ఆఫ్ లైన్ టోకెన్ల సంఖ్యను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఆప్ లైన్ లో 15వేల టోకెన్లు జారీ చేస్తుండటంతో ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40వేలు దాటే అవకాశముంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆఫ్ లైన్ లో టోకెన్లు తీసుకునేవారు కూడా కరోనా నెగెటివ్ రిపోర్ట్ (Corona Negative report), రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు (Vaccination Certificate) చూపాల్సివుంటుంది. అలాగే క్యూలైన్లలో కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది.