IPL Auction 2025 Live

Ram Temple Foundation Event: అయోధ్య భూమి పూజకు కరోనా భయం, దూరంగా ఉంటానని ప్రకటించిన ఉమాభారతి, ఈవెంట్‌ను వ‌ర్చువ‌ల్‌గా వీక్షించ‌నున్న అద్వానీ, జోషీ

రామ మందిర పునాది కార్యక్రమానికి (Ram Temple Bhoomi Pujan Ceremony) వచ్చే ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి అయోధ్యకు చెందిన రామ్ జన్మభూమి న్యాస్ (Ramjanmabhoomi Nyas), ప్రధాని కార్యాలయం (PMO) ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. 'కరోనా వైరస్ మహమ్మారి మధ్య అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరుల ఆరోగ్యం గురించి తాను ఆందోళన చెందుతున్నానంటూ' ఉమాభారతి ట్వీట్‌ చేశారు.

BJP Leader Uma Bharti (Photo Credits: ANI)

New Delhi, August 3: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ఆగ‌స్టు 5వ తేదీన జ‌ర‌గ‌నున్న భూమి పూజ కార్య‌క్ర‌మంలో (Ram Temple Foundation Event) ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌డం లేద‌ని ఉమాభార‌తి (Uma Bharti) తెలిపారు. రామ మందిర పునాది కార్యక్రమానికి (Ram Temple Bhoomi Pujan Ceremony) వచ్చే ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి అయోధ్యకు చెందిన రామ్ జన్మభూమి న్యాస్ (Ramjanmabhoomi Nyas), ప్రధాని కార్యాలయం (PMO) ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. 'కరోనా వైరస్ మహమ్మారి మధ్య అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరుల ఆరోగ్యం గురించి తాను ఆందోళన చెందుతున్నానంటూ' ఉమాభారతి ట్వీట్‌ చేశారు. బీజేపీ అగ్రనేతల్లో కరోనా కలవరం, బి.ఎస్.యడ్యూరప్పకు కరోనా పాజిటివ్, దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు, హోమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 పాజిటివ్

కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీకి చెందిన మరికొందరు ముఖ్యనేతలకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వార్తలు విన్న తర్వాత ఆమె ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే భోపాల్ నుంచి యూపీకి రైళ్లో వెళ్తానని అనేక మంది ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని సరయూ నది తీరంలోనే ఉంటానని.. భూమిపూజ జరిగిన చోటు నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత భూమిపూజ స్థలానికి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. అద్వానీ, జోషీలు కూడా ఈ ఈవెంట్‌ను వ‌ర్చువ‌ల్‌గా వీక్షించ‌నున్నారు. మోదీతో పాటు క‌ళ్యాణ్ సింగ్‌, విన‌య్ క‌టియార్‌లు ప్ర‌త్య‌క్షంగా భూమిపూజ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

She took to Twitter and wrote:

అయోధ్యలో భవ్య రామాలయం కోసం రాధేశ్యామ్‌ పాండే, శబ్ద్‌ వైజ్ఞానిక్‌ మహాకవి త్రిఫల సోదరులు 150కిపైగా నదుల జలాలను సేకరించి, భద్రపరిచారు. తాము సేకరించిన జలాలను, మట్టిని తీసుకుని ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. ‘శ్రీరాముని కృపతో మా కల ఫలించింది. 151 నదులు, 8 మహానదులు, 3 సముద్రాల నీటితోపాటు శ్రీలంకలోని 16 పవిత్ర ప్రదేశాల మట్టిని సేకరించాము. వీటి కోసం 1968 నుంచి 2019 వరకు కాలినడకన, సైకిల్, బైక్, రైలు, విమాన ప్రయాణాలు చేశాము. వీటిని ఆ రాముడికి అర్పించుకుంటాం’అని వారు తెలిపారు.