Dawood Ibrahim: దావూద్ ఇబ్రాహీంకు కరోనా పాజిటివ్, అతని భార్యకు కూడా కోవిడ్ 19 పాజిటివ్, క్వారంటైన్‌లో దావూద్ పర్సనల్ స్టాఫ్, వార్తలను ఖండిస్తున్న పాక్ ప్రభుత్వం

దావూద్‌తో పాటు అతని భార్య మెహజబీన్‌కు(His Wife Test Positive) కూడా కరోనా సోకినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అతని సిబ్బంది, పర్సనల్ స్టాఫ్ మొత్తం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం, అతని భార్య పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Dawood Ibrahim (Picture Source: ANI)

New Delhi, June 5: భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు (Underworld Don Dawood Ibrahim) కూడా కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్‌తో పాటు అతని భార్య మెహజబీన్‌కు(His Wife Test Positive) కూడా కరోనా సోకినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అతని సిబ్బంది, పర్సనల్ స్టాఫ్ మొత్తం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం, అతని భార్య పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 9,851 కేసులు, దేశంలో మొత్తం 2,26,334 పాజిటివ్‌ కేసులు, ఆందోళన కలిగిస్తున్న మహారాష్ట్ర

అయితే పాకిస్థాన్ ప్రభుత్వం (PAk Govt) మాత్రం దావూద్‌కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలను మాత్రం ఖండిస్తూ వస్తోంది. కానీ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్త పూర్తిగా నిజమని తెలుస్తోంది. కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన దావూద్ ఇబ్రహీం ముంబైలో పుట్టాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి కరాచీలో తలదాచుకుంటున్నట్టు సాక్ష్యాలూ ఉన్నాయి. 2003 సంవత్సరంలో దావూద్ ఇబ్రహీంను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి భారత్, అమెరికా. 1993 ముంబై వరుస పేలుళ్ల దాడికి సంబంధించి దావూద్ ఇబ్రహీం తల మీద 25 మిలియన్ అమెరికన్ డాలర్ల నజరానా ఉంది. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ దావూద్ ఇబ్రహీంను ప్రపంచంలోని టాప్ 10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఒకడిగా చేర్చింది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..