Union Budget Session 2020: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, నేడు దేశ ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశ పెట్టనున్న కేంద్రం, రేపు బడ్జెట్ ప్రసగం, వివరాలు ఇలా ఉన్నాయి

తొలి విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 11.00 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి....

Union Budget Sessions 2020 | File Photo

New Delhi, January 31: ఈరోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Union Budget Session 2020) ప్రారంభం అవుతాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత జనవరి 31 నుండి ఫిబ్రవరి 11 వరకు, రెండవ విడత మార్చి 2 నుండి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 11.00 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి.

ఫిబ్రవరి 1న, శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ 2020ను చట్ట సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందురోజు, అంటే ఈరోజే సమావేశాలు ప్రారంభమైన తర్వాత 2019-20కి గానూ చేపట్టిన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టనుంది. దీని ప్రకారం మోదీ ప్రభుత్వం ఈ ఏడాది కాలంగా ఏదైనా ఆర్థిక వృద్ధి సాధించిందా? దేశంలోని ఆర్థిక స్థితిగతులపై చర్చ జరుపుతారు.  నేడు, రేపు దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగుల విధుల బహిష్కరణ

భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర వివరాలను తెలుపుతూ, ఇక ముందు తీసుకోబోయే చర్యల గురించి చెప్పే ఆర్థిక సర్వే  (Economic survey 2019-20) నివేదికను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రవేశపెడతారు.

ఆర్థిక సర్వే అంటే ఏమిటి?

 

ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క వార్షిక నివేదిక (Annual Progress Report), గత 12 నెలల్లో దేశ ఆర్థిక పురోగతి మరియు ఒడిదుడుకులపై సమీక్షిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన అభివృద్ధి పథకాల పనితీరును వివరిస్తుంది. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ ఆర్థిక అవకాశాలపై విశ్లేషణ చేస్తుంది.

ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి సుబ్రమణియన్ నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన ఈ ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక కార్యదర్శి క్షుణ్ణంగా పరిశీలించి, ఆర్థిక మంత్రికి పంపిస్తారు. ఆర్థిక మంత్రి ఆమోదం లభించిన తర్వాత, పార్లమెంట్ సభ్యులకు ఈ రిపోర్ట్ కాపీలు అందజేయబడతాయి. ఈ ఆర్థిక సర్వేకు సంబంధించిన ప్రతుల్లో వాల్యూమ్ I, వాల్యూమ్ II మరియు స్టాటిస్టికల్ అపెండిక్స్ ఉండనున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2019-20 యొక్క లైవ్ కవరేజీని లోక్ సభ మరియు రాజ్యసభ టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. లేటేస్ట్‌లీ ద్వారా కూడా లైవ్ అప్‌డేట్స్ పొందవచ్చు.

2020-21 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11.00 గంటలకు పార్లమెంటులో సమర్పించనున్నారు.