Covid Vaccinatin in India: ఒకే రోజు 2 కోట్ల వ్యాక్సినేషన్, సరికొత్త రికార్డు నెలకొల్పిన భారత్, హెల్త్ వర్కర్లకు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ
ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు (Covid Vaccinatin in India) వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు.
New Delhi, Sep 17: కరోనావైరస్ వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు (Covid Vaccinatin in India) వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికి 1.3 కోట్లకుపైగా టీకా డోసులు వేయగా, సాయంత్రం ఐదు గంటలకు ఇది రెండు కోట్లకుపైగా (COVID-19 Vaccinations) నమోదైంది. దీంతో ‘ఈ చారిత్రక రికార్డు.. ప్రధాని మోదీ పుట్టిన రోజు బహుమతి’ అంటూ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ట్వీట్ చేశారు.
మరోవైపు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ‘కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశ టీకాల నిర్విరామ ప్రయత్నాలను జరుపుకుంటూ, రియల్ టైమ్‌లో టీకాలు వేస్తున్నామని చూపించడానికి మేము ఒక టిక్కర్‌ను జోడించాము. ప్రస్తుతం నిమిషానికి 42,000 టీకాలు లేదా సెకనుకు 700కు పైగా టీకాలు ఇది చూపిస్తున్నది’ అని పేర్కొన్నారు. కాగా, ఆగస్ట్ 31న దేశంలో గరిష్ఠంగా ఒకే రోజు 1.3 కోట్ల డోసుల టీకాలు వేశారు.
తాజాగా శుక్రవారం రెండు కోట్లకుపైగా టీకా డోసులతో కొత్త రికార్డు నెలకొన్నది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఈ ఏడాది జనవరి నుంచి శుక్రవారం ఉదయానికి 77 కోట్ల డోసుల టీకాలు వేయగా సాయంత్రానికి ఇది 79 కోట్ల డోసులను దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ (Union Health Minister Mansukh Mandaviya) ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆస్పత్రిలో 2 కోట్ల వ్యాక్సినేషన్ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా హెల్త్ వర్కర్లకు ఆరోగ్య మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గుడ్ జాబ్ అంటూ ట్వీట్ చేశారు.