Father’s 5th Marriage Stopped by Childeren: ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి, పీటల మీదనే చితకబాదిన కొడుకులు, 55 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లికి రెడీ అయిన యూపీ వ్యక్తి
మొదటి భార్యకు విడాకులిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో అతడు ఏడుగురు పిల్లల్ని కన్నాడు. గత ఆరు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్న నిత్య పెళ్లికొడుకు ఇటీవల విడాకులు (divorce)ఇచ్చాడు. ఆ తర్వాత రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
Lucknow, SEP 01: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదో పెళ్లికి (5th marriage) రెడీ అయి కాసేపట్లో వధువు మెడలతో తాళికట్టబోతున్న సమయంలో తండ్రిని పెళ్లిమండపంలోనే చితక్కొట్టారు కొడుకులు. దీంతో పెళ్లి పీటలమీద పూజా కార్యక్రమాలు చేస్తున్న వధువు తరువాత తనవంతు వస్తుందేమోనని భయపడి అక్కడి నుంచి చల్లగా జారుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో (Sitapur) జరిగిన ఈ ఘటనతో సదరు తండ్రి వయస్సు 55 ఏళ్లు. ఐదో పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యాడు. కొడుకులకు తెలికుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఈ విషయం ఆఖరి నిమిషంలో తెలుసుకున్న కొడుకులు కళ్యాణమండపటానికి వచ్చి మరీ చితక్కొట్టారు.
మొహల్లా పటియాకు (patiala) చెందిన 55 వరుడు రోడ్డు కాంట్రాక్టర్. మొదటి భార్యకు విడాకులిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో అతడు ఏడుగురు పిల్లల్ని కన్నాడు. గత ఆరు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్న నిత్య పెళ్లికొడుకు ఇటీవల విడాకులు (divorce)ఇచ్చాడు. ఆ తర్వాత రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లిళ్లపై ఆశ చావలేదో ఏమో గానీ కొడుకులకు తెలియకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆగస్టు 30 రాత్రి ముహూర్తం కూడా పెట్టుకున్నాడు. చాలా సీక్రెట్ గా ఈ పెళ్లి తంతు పూర్తి చేసుకున్నాడు. అంతా బాగానే జరుగుతోంది ఇక వధువు మెడలో తాళికట్టే సమయానికి కొడుకులు వచ్చి బడితె పూజ చేశారు.
సదరు వ్యక్తి ఐదోపెళ్లి విషయం అతని రెండో భార్య, ఆమె పిల్లలకు తెలియడంతో బంధువులతో కలిసి కల్యాణ మండపానికి వచ్చారు. వరుడిలా అలంకరించుకుని పెళ్లి పీటల మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తండ్రిని చూడగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తండ్రిని పట్టుకుని చావబాదారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో అర్థమైన తర్వాత వధువు అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పరారైంది. తండ్రి చేయబోయే ఘనకార్యంపై కొడుకులు రామ్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిత్య పెళ్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.