డి-అడిక్షన్‌ కార్యక్రమం వేదికగా ఛత్తీస్‌గఢ్‌ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్‌ టెకమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ ప్రజలను ఏకం చేస్తుందని, అయితే, కొద్ది మోతాదులో తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లిక్కర్‌పై రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే అజయ్‌ చంద్రాకర్‌ తీవ్రంగా తప్పుట్టారు . ‘భూపేశ్‌ బఘేల్‌ జీ ప్రభుత్వం, పార్టీ కార్టూన్లతో నిండిపోయింది. ఏఒక్కరికి విషయం అర్థంకాదు. ఇది పని చేసే ప్రభుత్వం కాదు అని ఆరోపించారు. మరోవైపు.. కొద్ది రోజుల క్రితం భంగ్‌, గంజాయిని లిక్కర్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించాలని బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధి వ్యాఖ్యానించిన తర్వాత రాష్ట్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన‍్యం సంతరించుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)