UP Govt School English Teacher: పేరుకే ఇంగ్లీష్ టీచర్, రెండు ముక్కలు ఇంగ్లీష్ చదవడం రాదు, బిత్తరపోయి వెంటనే సస్పెండ్ చేసిన అధికారులు, ఉత్తరప్రదేశ్‌లో ఘటన
దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం కొంత అయితే టీచర్ల వైఫల్యం మరికొంత అని చెప్పవచ్చు. అడ్డదారిలో జాబు తెచ్చుకున్న కొంతమంది టీచర్లు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నారు.
Lucknow, December 1: దేశంలో ప్రభుత్వ స్కూళ్లలో (government schools) విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం కొంత అయితే టీచర్ల వైఫల్యం మరికొంత అని చెప్పవచ్చు. అడ్డదారిలో జాబు తెచ్చుకున్న కొంతమంది టీచర్లు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచరే చదువులో ఫెయిల్ అయితే...సరిగ్గా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో సికందర్‌పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఇంగ్లీష్ టీచర్ (English teacher) ఇంగ్లీషులో రెండు లైన్లు చదవలేక (English teacher failed to read a textbook) అధికారుకుల అడ్డంగా దొరికిపోయింది. తనిఖీకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ANI Tweet
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా సికందర్‌పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాల(government school in Unnao district)ను జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ పాండే (Kumar Pandey district magistrate) ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఓ తరగతి గదిలో ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలి బోధన తేడాగా ఉండడంతో ఆమెకు ఇంగ్లిష్ పుస్తకం ఇచ్చి చదవమన్నాడు.
ఆమె పిల్లలకంటే దారుణంగా చదవడం మొదలెట్టింది. దీంతో వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఉపాధ్యాయురాలితో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు మెజిస్ట్రేట్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పిల్లల భవిష్యత్తు ఇలాంటి వారి చేతుల్లో పెడితే వారి భవిష్యత్తు ఏంటి అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించడంతో వారు కూడా చేసేదేమీ లేక మిన్నుకుండిపోయారు.