UP Shocker: గడ్డివాములో వేరొకరితో భార్య అలా ఉండటం చూసిన భర్త, నిప్పుపెట్టి సజీవదహనం చేసిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ లో దారుణం
ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఊరి పొలిమేరలోని ఓ గడ్డివాము దగ్గర ఆమెను సజీవదహనం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సగానికిపైగా కాలిపోయిన మృతదేహాన్ని బయటకి తీసి పోలీసులకు సమాచారం అందించారు.
Bareilly, NOV 19: అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన భార్య వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉందన్న అనుమానంతో భర్త.. ఆమెను సజీవదహనం (Burning Alive) చేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttarpradesh) బరేలి (Bareilly) జిల్లాలో జరిగింది. శనివారం రాత్రి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. భర్తపై కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నేపాలీ సింగ్, అంజలి (35) భార్యా భర్తలు. ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఊరి పొలిమేరలోని ఓ గడ్డివాము దగ్గర ఆమెను సజీవదహనం చేశాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు సగానికిపైగా కాలిపోయిన మృతదేహాన్ని బయటకి తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. గడ్డివాము దగ్గర తన భార్యను వేరే వ్యక్తితో అభ్యంతరకర స్థితిలో చూశానని, అందుకే గడ్డివాముకు నిప్పుపెట్టానని నేపాలీ సింగ్ పోలీసులకు తెలిపాడు. అంజలి తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అతడు చెప్పింది వాస్తవమేనా? లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.