UP Minister Flees From Court: దోషిగా ప్రకటించి శిక్ష ఖరారు చేసేలోపే కోర్టు నుంచి పరారైన మంత్రి, అక్రమాయుధాల కేసులో దోషిగా తేలిన ఉత్తరప్రదేశ్ మంత్రి, సీసీటీవీ ఫుటేజ్‌లో చిక్కిన అమాత్యుడు
శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ తీర్పు వెలువడగానే కోర్టు నుంచి ఆయన పారిపోయారు (Flees From Court). దీంతో మంత్రి రాకేష్ సచన్‌పై (Rakesh Sachan)విమర్శలు వెల్లువెత్తాయి.
Lucknow, AUG 07: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి రాకేష్ సచన్‌ను (Rakesh Sachan) , అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న కేసులో దోషిగా కోర్టు శనివారం నిర్ధారించింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ తీర్పు వెలువడగానే కోర్టు నుంచి ఆయన పారిపోయారు (Flees From Court). దీంతో మంత్రి రాకేష్ సచన్‌పై (Rakesh Sachan)విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కాంగ్రెస్ నేత అయిన రాకేష్ సచన్ యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన మధ్య, చిన్న, సూక్ష్మ సంస్థలు, ఖాదీ శాఖల మంత్రిగా ఉన్నారు. కాగా, రాకేష్ సచన్ అక్రమంగా ఆయుధం (Illegal weapon) కలిగి ఉన్నట్లు 1991లో కేసు నమోదైంది. శనివారం ఈ కేసుపై కాన్పూర్ కోర్టు తీర్పు ఇచ్చింది. మంత్రి రాకేష్ సచన్‌ను దోషిగా నిర్ధారించింది. అయితే శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. నిందితులు దోషిగా తేలితే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన రాకేష్, తీర్పు అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు.
మరోవైపు మంత్రి రాకేష్ తీరుపై ప్రతిపక్షాలు విమర్శించాయి. దోషిగా తేలిన ఆయన పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు కోర్టు నుంచి పారిపోయారని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన స్పందించారు. తాను కోర్టు నుంచి పారిపోలేదని, కావాలంటే అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని అన్నారు. ఇతర కార్యక్రమాలు ఉండటంతో వాటికి హాజరయ్యానని తెలిపారు.