No Non-Veg Day in UP: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, నవంబర్ 25న నో నాన్ వెజ్ డే గా ప్రకటన, మాంసం షాపులు, కబేలాలు మూసివేత
మీరా మూమెంట్ ఇన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించారు. దీనిని పాకిస్తాన్‌లోని సింధ్ హైదరాబాద్ లో స్థాపించాడు. అతనిపై పూణేలో దర్శన్ మ్యూజియం ఉంది. సాధు వాస్వానీ పుట్టినరోజు నవంబర్ 25న అంతర్జాతీయ మాంసరహిత దినోత్సవంగా గుర్తించబడింది.
Lucknow, NOV 24: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రేపు అన్ని మాంసం దుకాణాలు బంద్ (Meat Shops to Remain Shut) చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘నో నాన్ వెజ్’గా () ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adithyanath) నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 25ని “నో నాన్ వెజ్ డే”గా ప్రకటించింది. మాంసం దుకాణాలు, కబేళాలను మూసేయాలని అధికార ప్రకటన తెలిపింది.
సాధు తన్వర్ దాస్ లీలారామ్ వాస్వానీ ప్రసిద్ధ భారతీయ విద్యావేత్త. మీరా మూమెంట్ ఇన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించారు. దీనిని పాకిస్తాన్‌లోని సింధ్ హైదరాబాద్ లో స్థాపించాడు. అతనిపై పూణేలో దర్శన్ మ్యూజియం ఉంది. సాధు వాస్వానీ పుట్టినరోజు నవంబర్ 25న అంతర్జాతీయ మాంసరహిత దినోత్సవంగా గుర్తించబడింది.
హలాల్ సర్టిఫికేషన్ ఆహార ఉత్పత్తుల అమ్మకం, నిల్వ, పంపిణీలపై యూపీ సర్కార్ నిషేధం విధించింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఒక వర్గానికి సంబంధించిన ప్రజల మనోభావాలతో వ్యాపారం చేస్తున్నారని, నకిలీ హలాల్ సర్టిఫికేట్లతో వారిని మోసం చేస్తున్నారని యూపీ సర్కార్ పలు సంస్థలపై కేసు పెట్టింది. సమాజంలో వర్గవిద్వేషాన్ని పెంచడంతో పాటు విభజనను ప్రోత్సహిస్తుందని హలాల్ ప్రోడక్ట్‌ని బ్యాన్ చేసింది.