Uttar Pradesh: పెళ్లికి ముందు గదిలోకి వచ్చి పెళ్లి కొడుకు, పీటల మీదనే పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు, తన రూంలోకి రావొద్దని చెప్పినా వినలేదని కోపంతో నిర్ణయం

ఆమె అందం చూసి తట్టుకోలేకపోయాడు. వధువు ఉన్న గదిలోకి పదే పదే వెళ్లాడు. కాగా, ఇది చూసిన వరుడి తండ్రి అలా చేయవద్దని చెప్పాడు. అయినప్పటికీ పెళ్లికుమారుడు లెక్క చేయలేదు. వధువు గదిలోకి వెళ్లసాగాడు. దీంతో ఆగ్రహం పట్టలేని తండ్రి అందరి ముందు కుమారుడి చెంపపై కొట్టాడు.

Representational Image (Photo Credit-File Photo)

Lucknow, JAN 29: వధువు అందానికి ఆకర్షితుడైన వరుడు (Groom) పెళ్లి తంతు పూర్తికాక ముందే పలుసార్లు ఆమె గదిలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణ వల్ల ఆ పెళ్లి రద్దైంది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌ (Chitrakoot) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక జంటకు పెళ్లి నిశ్చయమైంది. వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు. వధువరులిద్దరూ పెళ్లి దండలు మార్చుకున్నారు. మిగతా పెళ్లి ఆచారాలు జరగాల్సి ఉంది. అయితే పెళ్లికుమార్తె పట్ల పెళ్లికుమారుడు ఆకర్షితుడయ్యాడు. ఆమె అందం చూసి తట్టుకోలేకపోయాడు. వధువు ఉన్న గదిలోకి పదే పదే వెళ్లాడు.

Gauhati High Court-Jeans: జీన్స్ ధరించి కోర్టుకొచ్చిన సీనియర్ న్యాయవాది.. బయటకు పంపిన న్యాయమూర్తి 

కాగా, ఇది చూసిన వరుడి తండ్రి అలా చేయవద్దని చెప్పాడు. అయినప్పటికీ పెళ్లికుమారుడు లెక్క చేయలేదు. వధువు గదిలోకి వెళ్లసాగాడు. దీంతో ఆగ్రహం పట్టలేని తండ్రి అందరి ముందు కుమారుడి చెంపపై కొట్టాడు. అయితే వరుడు కూడా తిరిగి తన తండ్రి చెంపపై కొట్టాడు. ఇది చూసిన బంధువులు, వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు.

Firing on Odisha Health Minister: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్‌ఐ, విషమంగా మంత్రి ఆరోగ్యం, కాల్పులకు గల కారణాలపై ఆరా 

మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో వరుడితో తాళి కట్టించుకునేందుకు వధువు నిరాకరించింది (Bride Cancels Wedding). అతడితో పెళ్లిని రద్దు చేయాలని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లిని రద్దు చేయాలని వధువరుల కుటుంబాలు నిర్ణయించాయి. దీంతో వరుడి కుటుంబం, బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.