Uttar Pradesh: కామాంధులైన రాజకీయ నాయకులు, మైనర్ బాలికపై 5 ఏళ్ల నుంచి అత్యాచారం, ఎస్పీ, బీఎస్పీ నేతలను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు, లలిత్‌పూర్ మైనర్ బాలిక రేప్ కేసులో 7 మంది అరెస్ట్

ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది.

Representational Image (Photo Credits: File Image)

Lucknow, Oct 17: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో లలిత్‌పూర్‌ జిల్లా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు తిలక్‌ యాదవ్, బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) దీపక్‌ అహిర్వార్‌ను పోలీసులు అరెస్టు (BSP Leader Dipak Ahirwar and SP Leader Tilak Yadav Arrested) చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. తనపై ఐదేళ్లపాటు అత్యాచారం (Lalitpur Minor Girl Rape Case) చేశారంటూ బాధితురాలు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సహా మొత్తం 25 మందిపై ఫిర్యాదు చేసింది.

అక్టోబర్‌ 12న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో బాలిక తండ్రి, మామ కూడా ఉన్నారు. శుక్రవారం మీర్జాపూర్‌లో తిలక్‌ యాదవ్, దీపక్‌ అహిర్వార్‌తో పాటు మహేంద్ర దూబే అనే ఇంజనీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో తమ పార్టీ నేత అరెస్టు కావడంతో సమాజ్‌వాదీ పార్టీ లలిత్‌పూర్‌ జిల్లా పార్టీ యూనిట్‌ను రద్దు చేసింది.గత ఐదేళ్లుగా తనపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో సహా 25 మంది అత్యాచారాలకు పాల్పడినట్టు బాలిక చేసిన ఫిర్యాదుతో ఈ అరెస్టులు చేశామని పోలీస్ సూపరింటెండెంట్ నిఖిల్ పాఠక్ తెలిపారు. బాధితురాలి తండ్రి, మేనమామ, ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు సహా అందరిపైనా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 12న కేసు నమోదైందని అన్నారు.

కామాంధులకు చిక్కిన మైనర్ బాలిక, తండ్రితో సహా 28 మంది రాజకీయ నేతలు దారుణంగా అత్యాచారం, కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

మీర్జాపూర్ జిల్లాలోని ఓ హోటల్‌పై శుక్రవారం దాడులు జరిపి లలిత్‌పూర్ సమాజ్‌వాదీ పార్టీ జిల్లా చీఫ్ తిలక్ యాదవ్, బీఎస్‌పీ జిల్లా చీఫ్ దీపక్ అహిర్‌వర్, మహేంద్ర డూబే అనే ఒక ఇంజనీర్‌ను అరెస్టు చేసి స్థానిక కోర్టు ముందు హాజరుపరిచామని నిఖిల్ పాఠక్ తెలిపారు. వీరిని 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించిందని చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను ఇంతకుముందే అరెస్టు చేశారు.