Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Lucknow, Oct 13: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కామాంధులు రోజు రొజుకు బరి తెగిస్తున్నారు. దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక షాకింగ్ సంఘటనలో (Shocking Incident in UP), 17 ఏళ్ల అమ్మాయి తన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు సహా 28 మంది (17 year old Girl Has Accused 28 Persons) తనపై గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, లలిత్‌పూర్ పోలీసులు మంగళవారం దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఆమె ఫిర్యాదు చేసిన నిందితుల్లో (Including her father, SP, BSP leaders) ఆమె తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, ఎస్‌పి నగర అధ్యక్షుడు రాజేష్ జైన్ జోజియా, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) జిల్లా అధ్యక్షుడు దీపక్ అహిర్వార్ తదితరులు ఉన్నారు. వారిపై సెక్షన్లు 354, 376-డి, 323, 506, ఐపిసిలోని ఇతర సెక్షన్లు మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద కేసులు నమోదు చేయబడ్డాయి.

బీజేపీ కార్పొరేటర్ భర్త అక్రమ సంబంధం, చెప్పుతో కొట్టిన బాధితురాలి తల్లి, తమ కూతుర్ని కిడ్నాప్ చేశారంటూ నిందితుడి ఇంటి ముందు ఆందోళన, నిజామాబాద్ జిల్లాలో ఘటన

తాను 6వ తరగతి చదువుకుంటున్న సమయంలో తండ్రి బలవంతంగా పోర్నోగ్రఫీ చూపించాడని బాధితురాలు ఆరోపించింది.తరువాత, ఆమె తండ్రి ఆమెకు కొత్త బట్టలు కొని, ఆమెకు డ్రైవింగ్ నేర్పించాలనే నెపంతో మోటార్‌బైక్‌పై పొలాల్లోకి తీసుకెళ్లాడు. పొలాలకు తీసుకెళ్లిన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది. అత్యాచార సమయంలో మౌనంగా ఉండాలని లేకుంటే ఆమె తల్లిని చంపేస్తానని బెదిరిస్తూ అత్యాచారం చేశాడని ఆరోపించింది.

Here's IANS Tweet

ఆ తర్వాత తనను రెగ్యులర్‌గా కొన్ని హోటళ్లకు తీసుకెళ్లేవాడని, అక్కడ చాలా మంది వ్యక్తులు మత్తుమందులతో కూడిన స్నాక్స్ ఇచ్చి తనపై లైంగిక దాడులు చేశారని ఆమె పోలీసులకు తెలిపింది. ఇలా చాలా ఏళ్లుగా తనపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, పలువురు రాజకీయ నేతలు కూడా తనను బలాత్కరించారని సదరు యువతి ఆరోపించింది. మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ కూడా నలుగురు మేనమామలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఆరోపించింది. తన అమ్మమ్మ ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆమె పేర్కొన్నారు.

దుర్మార్గపు భర్త.. భార్యను చంపేందుకు నాగుపామును వదిలాడు, అది కాటేయడంతో భార్య మృతి, నిందితుడికి జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు

ప్రస్తుతం బాధితురాలి వయసు 17 సంవత్సరాలు కావడంతో ఈ కేసులో పోక్సో సెక్షన్ కూడా చేర్చడం జరిగింది. ఈ కేసు చాలా సున్నితమైనదని, చాలా సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు. నిందితుల్లో బీఎస్పీ, ఎస్పీ రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తనపై కుట్ర జరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత తిలక్ యాదవ్ ఆరోపిస్తున్నారు. తన నేరం రుజువైతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.