Nizamabad: బీజేపీ కార్పొరేటర్ భర్త అక్రమ సంబంధం, చెప్పుతో కొట్టిన బాధితురాలి తల్లి, తమ కూతుర్ని కిడ్నాప్ చేశారంటూ నిందితుడి ఇంటి ముందు ఆందోళన, నిజామాబాద్ జిల్లాలో ఘటన
Representational Image | (Photo Credits: IANS)

Nizamabad, Oct 13: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో బీజేపీ నేత వివాహేతర సంబంధం తాజాగా వెలుగు చూసింది. తమ కూతురిని బ్లాక్ మెయిల్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకుని మోసం చేశాడ‌ని బాధితురాలి త‌ల్లి వాపోయింది. బీజేపీ కార్పొరేట‌ర్‌ (Nizamabad bjp Corporator) భ‌ర్తను బాధితురాలి తల్లి కోపంతో చెప్పుతో కొట్టింది. తన కూతురిని మోసం చేశాడంటూ వినాయక నగర్‌లోని కార్పొరేటర్ భర్త (Nizamabad bjp Corporator husband illegal affair) ఇంటిముందు బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు.

రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీనును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నమంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మాకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన వ్య‌క్తం చేశారు. ఇవాళ ఉద‌యం ఆకుల శీను ఇంటికి వెళ్లి ఆయ‌న‌పై దాడి చేశారు. త‌మ కూతురిని అప్పగించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.శీను కొంత కాలంగా తమ కూతురికి మాయ మాటలు చెప్పి మోసం చేశాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పదమేంటో నాకు తెలియదు, నేను తెలుగు సరిగా మాట్లాడలేను, జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట హాజరైన వీసీ సజ్జనార్

ఎత్తుకెళ్లిన అమ్మాయిని కాంగ్రెస్ సర్పంచ్ శేఖర్ గౌడ్ ఇంట్లో ఆకుల శీను ఉంచినట్టు తెలుస్తోంది. అయితే, కార్పొరేటర్ భర్త తీరుపై గతంలోనూ బాధిత తల్లిదండ్రులు ఎన్నోసార్లు గుట్టుగా బెదిరించారని, అయినా ఆయన వినలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.