UP House Fire: అర్ధరాత్రి ఇంట్లో మంటలు, తల్లితో సహా ఐదుగురు చిన్నారులు సజీవదహనం, మంటలకు ఒక్కసారిగా పేలిన సిలిండర్

చిన్నారులంతా 1–10 ఏళ్లలోపు వారే. యూపీలోని ఉర్ధా గ్రామానికి చెందిన సంగీత, ఆమె అయిదుగురు పిల్లలు ఇంట్లో పడుకోగా, ఆమె భర్త, అతడి తల్లిదండ్రులు ఆరు బయట నిద్రించారు. గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

Fire (Representational image) Photo Credits: Flickr)

Lucknow, June 16: ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ జిల్లాలో ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, అయిదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులంతా 1–10 ఏళ్లలోపు వారే. యూపీలోని ఉర్ధా గ్రామానికి చెందిన సంగీత, ఆమె అయిదుగురు పిల్లలు ఇంట్లో పడుకోగా, ఆమె భర్త, అతడి తల్లిదండ్రులు ఆరు బయట నిద్రించారు. గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

బాపట్లలో దారుణం, పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు, చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

మంటలు అంటుకోవడంతో ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. సంగీత భర్త వారిని కాపాడేందుకు ప్రయత్నించినా మంటల తీవ్రత కారణంగా వీలు కాలేదు.సంగీతతోపాటు ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు వయస్సున్న చిన్నారులు మంటలకు ఆహుతయ్యారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.