Representational Image | (Photo Credits: IANS)

Bapatla, June 16: ఏపీలోని బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ దారుణ ఘటన జరిగింది. చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెంకి చెందిన ఉప్పల అమర్నాథ్‌ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా బాలుడి స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరికొందరితో కలిసి అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటల అంటుకొని బాలుడు హాహాకారాలు చేస్తుండటాన్ని స్థానికులు గమనించారు.

దారుణం, భార్యాకూతుర్లను చంపి మృతదేహాలను ముక్కలుగా చేసి కాలువలోకి పడేసిన భర్త

వెంటనే మంటలు ఆర్పి తీవ్ర గాయాలపాలైన అమర్నాథ్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.తనపై వెంకటేశ్వర్‌రెడ్డి, మరికొందరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని మృతికి ముందు పోలీసులకు అమర్నాథ్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.