Uttarpradesh Fire Accident: అర్ధరాత్రి విషాదం, ఇంట్లో మంటలు చెలరేగి కుటుంబమంతా సజీవదహనం, ప్రమాదమా? కుట్రకోణమా? అని పోలీసుల అనుమానం, మృతిచెందిన వారిలో ఐదుగురు చిన్నారులే

అనుమానాస్పద స్థితిలో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో (Fire Accident) ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. మరణించిన వారిలో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకోవటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపుచేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.

Uttarpradesh Fire Accident (PIC @ Twitter)

Lucknow, June 15: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ (Kushinagar) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో (Fire Accident) ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. మరణించిన వారిలో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకోవటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపుచేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఇంట్లో అగ్నిప్రమాదం ఎలాజరిగిందన్న కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్దా బాపునగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఇంట్లోనుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు వేగంగా ఇంటి చుట్టూ వ్యాప్తిచెందడంతో ఇట్లోని వారు బయటకు రాలేకపోయారు. ఫలితంగా మంటల్లోనే వారు సజీవదహనం అయ్యారు.

మృతుల్లో ఒక మహిళ, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పోలీసులు మృతదేహాలను సేకరించి మార్చరీకి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అయితే, ఇంట్లోకి మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై స్పష్టమైన సమాచారం వెల్లడి కాలేదు.