IPL Auction 2025 Live

International Cricket Stadium in Varanasi: భారత్‌లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రూ.300 కోట్లతో చేపట్టనున్న బీసీసీఐ, ప్రధాని మోదీ నియోజకవర్గంలోనే భారీ స్టేడియం నిర్మిస్తున్నట్లు ప్రకటన

ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 31 ఎకరాల భూమిని సేకరించింది. ఇందుకు పరిహారంగా రూ. 120 కోట్ల రూపాయలను రైతులకు అందించింది. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు పరిశీలించారు.

Cricket Stadium | Representational Image (Photo Credits: Pixabay)

Varanasi, March 19: భారత్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రానుంది. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (International Cricket Stadium) నిర్మించనున్నారు. మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని ఓ ఆటగా కాకుండా ఓ ఎమోషన్‌లా భావిస్తారు భారతీయులు. అందుకే క్రికెట్‌ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అభిమానులతో స్టేడియాలు నిండిపోతుంటాయి. ఈక్రమంలో క్రికెట్‌ పట్ల ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ శుభవార్త చెప్పింది. అత్యాధునిక హంగులు, సదుపాయాలతో మరో కొత్త అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు రూ. 300 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రికెట్‌ స్టేడియం పనులు ప్రారంభమైనట్లు సమాచారం.

Ashwini Vaishnaw: వీడియో ఇదిగో, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో సామాన్యులతో కలిసి ప్రయాణించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి 

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో (Varanasi) ఈ స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 31 ఎకరాల భూమిని సేకరించింది. ఇందుకు పరిహారంగా రూ. 120 కోట్ల రూపాయలను రైతులకు అందించింది. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు పరిశీలించారు. దీనిపై బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లాకి, కార్యదర్శి జై షాకు రిపోర్ట్‌ కూడా ఇచ్చారట. కాగా వారణాసిలో నిర్మించే ఈ స్టేడియాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించనున్నారని తెలుస్తోంది. సుమారు రూ.30వేల సీటింగ్‌ కెపాసిటీతో మ్యాచ్‌ని వీక్షించేలా ఓ కాంట్రాక్ట్‌ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారట.

IND vs AUS: స్టార్క్ స్వింగ్ దెబ్బకు మా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు, ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ, మార్ష్‌ ప్రపంచం‍లోనే పవర్‌ హిట్టర్లలో టాప్‌ 3లో ఒకడని వెల్లడి 

స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పేపర్‌ వర్క్‌కు సుమారు 2 నెలలు పడుతుందట. దీనిపై ఓ క్లారిటీ రాగానే ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పనులు చకచకా పూర్తిచేసి జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు.