Uttar Pradesh: అయోధ్య మసీదుల్లో అభ్యంతరకర పోస్టర్లు, ఏడుగురిని అరెస్ట్ చేసిన అయోధ్య పోలీసులు, పరారీలో నలుగురు నిందితులు

అయోధ్య నగరంలోని పలు మసీదులపై (Mosques in Ayodhya) అభ్యంతరకరమైన పోస్టర్లు వేసి, వస్తువులను విసిరి నగర శాంతి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఏడుగురిని అయోధ్య పోలీసులు (Ayodhya police) గురువారం అరెస్టు చేశారు.

Representative Image

Lucknow, April 29: అయోధ్య నగరంలోని పలు మసీదులపై (Mosques in Ayodhya) అభ్యంతరకరమైన పోస్టర్లు వేసి, వస్తువులను విసిరి నగర శాంతి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఏడుగురిని అయోధ్య పోలీసులు (Ayodhya police) గురువారం అరెస్టు చేశారు.అరెస్టయిన నిందితుల్లో మహేష్ కుమార్ మిశ్రా, ప్రత్యూష్ శ్రీవాస్తవ, నితిన్ కుమార్, దీపక్ కుమార్ గౌర్ అలియాస్ గుంజన్, బ్రిజేష్ పాండే, శత్రుఘ్న ప్రజాపతి, విమల్ పాండేలుగా గుర్తించారు. వీరంతా అయోధ్య వాసులని అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ కుమార్ పాండే చెప్పారు.

11 మంది ఈ సంఘటనకు (Seven Held for Dropping Objectionable Items) పాల్పడ్డారని, వారిలో ఏడుగురిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు. వీళ్లంతా బైక్‌ల‌పై వెళ్తూ మ‌సీదుల్లో పోస్ట‌ర్లు, వ‌స్తువుల్ని విసిరేశార‌ని, వాళ్ల‌పై గ్యాంగ్‌స్ట‌ర్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు ఎస్పీ తెలిపారు. మ‌హేశ్ కుమార్ మిశ్రాను ప్ర‌ధాన నిందితుడిగా గుర్తించారు. క‌శ్మీర్ మొహ‌ల్లా, త‌త్‌షా మ‌సీదు, గోసియానా రామ్‌న‌గ‌ర్ మ‌సీదు, ఈద్గా సివిల్ లైన్ మ‌సీదు, గులాబ్ షా ద‌ర్గా, ద‌ర్గా జైల్ మ‌సీదుల్లో వ‌స్తువుల్ని పారేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

మళ్లీ పెరుగుతున్న కేసులు, దేశంలో తాజాగా 3,377 మందికి కరోనా, గత 24 గంటల్లో 2496 మంది కోలుకోగా, 60 మంది మృతి

ఇక జాతీయ రహదారులకు సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్‌లో జరిగిన స‌మావేశంలో నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ‌ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌శాంత్ రెడ్డి ప్ర‌సంగిస్తుండ‌గా బీజేపీ కార్య‌క‌ర్త‌లు ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆ స‌మావేశంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. చివ‌ర‌కు కిషన్‌ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేయ‌డంతో ప్ర‌శాంత్ రెడ్డి ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.