Uttar Pradesh Shocker: ఓ పక్క తాగుడు..మరో పక్క అప్పులు, ముగ్గురు చిన్నారులను, భార్యను దారుణంగా గొంతు కోసి చంపేసిన కసాయి, ఆపై విషం తాగి ఆత్మహత్య, యూపీలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మద్యానికి బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతుకోసి (Drunkard slits throats of wife and three kids) అంతమొందించడంతో పాటు తాను విషం (then attempted suicide by consumes poison) సేవించాడు
Kushinagar, August 28: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కుషినగర్ జిల్లాలోని (Kushinagar) కుడ్వా గ్రామం పరిధిలోని కుమారియా గోపాల్ తోలాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతుకోసి (Drunkard slits throats of wife and three kids) అంతమొందించడంతో పాటు తాను విషం (then attempted suicide by consumes poison) సేవించాడు. నిందితుడిని తాపీ పనిచేసే జితేంద్ర కుష్వాహగా గుర్తించారు. ఈ ఘటనతో కుద్వా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
నిందితుడు భార్య సహా నాలుగు నుంచి 8 సంవత్సరాలలోపు చిన్నారులను కర్కశంగా చంపడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషం సేవించిన జితేంద్రను గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజ్‌కు తరలించగా అతడి పరిస్ధితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మద్యానికి బానిసైన జితేంద్ర భార్య లీలావతి (31), పిల్లలు ఆకాష్(8), వికాస్ (6) నిఖిల్ (4)లను పొట్టనపెట్టుకున్నాడని బంధువులు, స్ధానికులు విలపించారు. అప్పుల బాధతో పాటు మద్యానికి బానిసైన జితేంద్రను అత్తింటి వారు మందలించడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు.
నిందితుడు సమీపంలోని తన తల్లిదండ్రులతో విడివిడిగా నివసించాడు. గురువారం జితేంద్ర యొక్క వికలాంగ తల్లి వారి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు లాక్ చేయబడింది. ఏమయిందోనని ఆమె తలుపు రంధ్రం లోపలకి చూసింది. దీంతో గదిలో మృతదేహాలను చూసి ఒక్కసారిగా షాక్ తింది. జితేంద్ర నేలపై నురగలు కక్కుతూ పడిఉన్నాడు. వెంటనే అతని తల్లి తలుపు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన గ్రామస్తులకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. కాగా ఆదివారం రక్షాబంధన్ తర్వాత జితేంద్ర తన భార్యను తన తల్లిగారి ఇంటి నుండి తీసుకువచ్చాడు. అతని తాగుడు అలవాటును విడిచిపెట్టమని అతని అత్తమామలు ఒత్తిడి చేశారని స్థానికులు చెబుతున్నారు.