Uttar Pradesh Tragedy: ఘోర ప్రమాదం, భవనం కూలి 17 మంది మృతి, యూపీలో మురాద్‌నగర్ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో కూలిన పైకప్పు, ప్రమాదంలో పలువురికి గాయాలు
ఘజియాబాద్‌లో భవనం కూలి17 మంది మృతి (Uttar Pradesh Tragedy) చెందారు.మురాద్‌నగర్ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు
Ghaziabad, January 3: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో భవనం కూలి17 మంది మృతి (Uttar Pradesh Tragedy) చెందారు.మురాద్‌నగర్ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి.
ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించి సమీప దవాఖానలకు తరలించారు. భారీ వర్షం కారణంగా భవనం పిల్లర్ ఒక్కసారిగా కూలడంతో పైకప్పు కుప్పకూలి ప్రమాదం జరిగింది.
ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విచారం వ్యక్తం చేశారు.గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాద జరిగిన సమయంలో శ్మశానవాటిక కాంప్లెక్స్ కింద 40 మందిపైగా ఉన్నట్లు సమాచారం.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
శిధిలాల కింద 18 మంది, మహారాష్ట్రలో కూలిన ఐదు అంతస్తుల భవనం
మరో రాష్ట్రం కేరళలోని కాసరఘోడ్ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పనథూర్ సమీపంలోని రాజాపురం వద్ద ఈ దర్ఘుటన జరిగింది. మృతులను శ్రియాస్ ( 11), ఆదర్శ్ (14), జయలక్ష్మి, సుమతి, రాజేశ్, రవీందచంద్రతోపాటు మరొకరిగా గుర్తించారు.
మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
కొడగు తాలూకాలోని కరికే గ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కన్హాన్‌ఘడ్, పలథడిలోని దవాఖానలకు తరలించారు. ఘటనపై కేళర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనపై ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏకే ససీంద్రన్ విచారణకు ఆదేశించారు.