Pilibhit Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుమంది అక్కడికక్కడే మృతి, 32 మందికి పైగా గాయాలు, పిలిభిత్ జిల్లాలో బస్సును ఢీ కొట్టిన బొలెరో వాహనం
పిలిబిత్, ఖుషీనగర్ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై లక్నో నుంచి వస్తున్న బస్సును బొలెరో ఢీకొనడంతో (Uttar Pradesh Road Accident) ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ANI తెలిపింది.
Pilibhit, Oct 17: ఉత్తర ప్రదేశ్‌లో పిలిభిత్ జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం (Pilibhit Road Accident) చోటుచేసుకుంది. పిలిబిత్, ఖుషీనగర్ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై లక్నో నుంచి వస్తున్న బస్సును బొలెరో ఢీకొనడంతో (Uttar Pradesh Road Accident) ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ANI తెలిపింది.
పిలిభిత్ పోలీస్ సూపరింటెండెంట్ జై ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. పిలిభిత్ డిపో (Pilibhit) నుంచి లక్నోకు బయలుదేరిన బస్సును బోలెరో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఒక మహిళ సహా ఏడుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా.. స్వల్పంగా గాయపడిన 24 మందిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Here's ANI Update
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది, బొలెరోలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు నేరుగా పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిందిప్రమాద సమయంలో బొలెరో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.