Uttarakhand Flash Floods: ఘోర విషాదం..ఆ 134 మంది చనిపోయినట్లే, ఉత్తరాఖండ్ మెరుపు వరదల్లో గల్లంతయిన వారిని ‘మరణించినట్టుగా భావిస్తున్నట్టు’ ప్రకటించిన ప్రభుత్వం, మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ
ఉత్తరాఖండ్‌లో ఇటీవల మెరుపు వరదలు సంభవించిన సంగతి విదితమే. ఈ వరదల్లో మొత్తం 175 మంది గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో కొంతమంది బాడీలను రెస్కూటీం గుర్తించింది. అయితే ఇప్పటికీ అక్కడ రెస్క్యూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం విలయంలో (Uttarakhand Flash Floods) గల్లంతైన వారిలో ఇప్పటికీ కనిపించకుండా పోయిన 134 మంది ‘మరణించినట్టుగా భావిస్తున్నట్టు’ (134 Missing People To Be Declared Dead) ప్రకటించింది.
Chamoli, Feb 23: ఉత్తరాఖండ్‌లో ఇటీవల మెరుపు వరదలు సంభవించిన సంగతి విదితమే. ఈ వరదల్లో మొత్తం 175 మంది గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో కొంతమంది బాడీలను రెస్కూటీం గుర్తించింది. అయితే ఇప్పటికీ అక్కడ రెస్క్యూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం విలయంలో (Uttarakhand Flash Floods) గల్లంతైన వారిలో ఇప్పటికీ కనిపించకుండా పోయిన 134 మంది ‘మరణించినట్టుగా భావిస్తున్నట్టు’ (134 Missing People To Be Declared Dead) ప్రకటించింది. ఫిబ్రవరి 7 న హిమానీనదం విలయం జరిగనప్పటి నుండి నిరంతర సహాయక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా 134 మంది ఆచూకి దొరకడం లేదు.
తాజాగా మరో రెండు మృతదేహాలను గుర్తించడంతో చమోలీ హిమానీనద విపత్తులో (Chamoli glacier disaster) చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 70కి చేరినట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇప్పటివరకు 29 మానవ అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 134 మంది జాడ తెలియకపోవడంతో వారంతా చనిపోయినట్టుగా భావిస్తున్నామని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి అమిత్ నేగి (Uttarakhand Health Secretary Amit Negi) తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యలకు జనన, మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం (Birth and Death Registration Act) డెత్ సర్టిఫికెట్‌లు అందించనున్నట్టు పేర్కొన్నారు. సాధారణంగా మరణ ధ్రువీకరణ పత్రాలు అందించే పరిస్థితులకు ఇది భిన్నమైనదని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
తాత్కాలిక సరస్సుతో పొంచి ఉన్న మరో ప్రమాదం
బాధిత కుటుంబ సభ్యులు అవసరమైన అఫిడవిట్, ఇతర వివరాలను సంబంధింత అధికారులకు అందిస్తే , అప్పుడా అధికారి విచారణ అనంతరం మరణ ధ్రువీకరణ పత్రం చేస్తారని అందులో పేర్కొన్నారు. గల్లంతైన వారి విషయంలో పరిహారానికి ఇది అవసరమవుతుందని తెలిపారు.
ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన వారిని మూడు కేటగిరీలుగా పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం సమీపంలోని గల్లంతయిన ప్రజలను మొదటి కేటగిరీలో చేర్చగా, విపత్తు సంభవించిన ప్రాంతం వద్ద ఉండి గల్లంతైన ఇతర జిల్లాలకు చెందిన వారిని రెండో కేటగిరీలో చేర్చారు. మూడో విభాగంలో పర్యాటకులను చేర్చారు.
నిన్న విపత్తు నియంత్రణ శాఖ నుండి వచ్చిన సమాచారం ప్రకారం శ్రీనగర్ చౌరాస్ నుంచి ఒక మృతదేహాన్ని, కీర్తి నగర్ నుంచి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తప్పిపోయిన 206 మందిలో ఇప్పటివరకు 70 మృతదేహాలు, 29 మానవ అవయవాలు వెలికి తీయబడ్డాయి ”అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)