Uttar Pradesh: పోలీసులంటే ఇలా ఉండాలి, కోడలిని ఇంట్లోకి రానివ్వనందుకు బుల్డోజర్‌తో ఇంటిని కూల్చేందుకే ప్రయత్నించిన పోలీసులు, దెబ్బకు తలుపులు తీసి కోడలిని ఇంట్లోకి తీసుకువెళ్లిన అత్తింటివారు

కోడలిని అత్త మామలు ఇంట్లోకి రానీయకపోవడంతో (Cast Out of House Over Dowry Dispute) పోలీసులు ఆ ఇంటిని కూల్చడానికి బుల్డోజర్ ను (Cops Bring Bulldozer to Help Woman Enter In-Laws Home) తీసుకువచ్చారు.

UP Police- Representational Image | PTI Photo

Lucknow, August 30: యూపీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కోడలిని అత్త మామలు ఇంట్లోకి రానీయకపోవడంతో (Cast Out of House Over Dowry Dispute) పోలీసులు ఆ ఇంటిని కూల్చడానికి బుల్డోజర్ ను (Cops Bring Bulldozer to Help Woman Enter In-Laws Home) తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన అత్తింటివారు కోడలిని ఇంట్లోకి తీసుకెవెళ్లారు. ఘటన వివరాల్లోకెళితే.యూపీలోని హల్దౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్‌లో నూతన్ అనే మహిళను 2017లో అత్తంటివారు కట్నం తీసుకురాలేదని బయటకు పంపించివేశారు.

వారు ఆమెను బయటకు పంపారు గాని తర్వాత ఆమెను తిరిగి తీసుకురావడానికి అంగీకరించలేదు.2019లో ఈ వ్యవహారంలో న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు 30 ఏళ్ల మహిళ తన అత్తింట్లోకి "అన్ని విధాలుగా" తిరిగి ప్రవేశించేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఆమెను అత్తగారింట్లో దిగబెట్టేందుకు వెళ్లారు. పోలీసు బృందం ఆమె అత్తమామల ఇంటికి చేరుకున్నప్పుడు, లౌడ్‌స్పీకర్‌లో ఎన్నిసార్లు హెచ్చరించినా వారు తలుపు తీయలేదు.దీంతో పోలీసులు బుల్‌డోజర్‌ సాయం తీసుకున్నారు. ఇది గమనించిన అత్తింటి వారు వెంటనే ఆమెను ఇంట్లోకి అనుమతించారు. ఆమెకు పోలీసు భద్రత కూడా కల్పించారు.

Here's Video

ఎస్పీ (నగరం) ప్రవీణ్ రంజన్ మాట్లాడుతూ, "బాధిత మహిళ నూతన్ మాలిక్ ఇంట్లోకి ఎలాగైనా ప్రవేశించేలా చూడాలని పోలీసులకు కోర్టు ఆదేశం. ఆదివారం ఉదయం పోలీసు బృందం ఆమె అత్తమామల ఇంటికి చేరుకున్నప్పుడు, లౌడ్‌స్పీకర్‌లో ఎన్నిసార్లు హెచ్చరించినా వారు తలుపు తీయలేదు. అందుకే మేము బుల్‌డోజర్‌ని తీసుకోవలసి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత వారు మహిళను ఇంట్లోకి అనుమతించారు. ఆమెకు పోలీసు భద్రత కూడా కల్పించారు."కట్నం విషయంలో అత్తమామలతో మహిళకు గొడవ జరిగిందని తెలిపారు.

 కాకినాడలో గర్భిణిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని వార్తలు, నిందితుడు పరారీలో..

నూతన్ తండ్రి షేర్ సింగ్ మాట్లాడుతూ, "2017లో నా కుమార్తె తన భర్తతో వివాహం చేసుకున్నప్పుడు, మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ తరువాత, గృహ హింస వేధింపులకు గురయింది. తగిన కట్నం తీసుకురానందుకు అత్తింటి కుటుంబ సభ్యుల ద్వారా వేధింపులు ఎక్కువయ్యాయి. మేము వారి డిమాండ్లను నెరవేర్చలేకపోవడంతో, వారు ఆమెను ఇంటి నుండి గెంటేశారు. 2019లో హల్దౌర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త మరియు అత్తమామలపై ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఆమెను తిరిగి అంగీకరించలేదు. తరువాత, మేము అలహాబాద్ హెచ్‌సి తలుపులు తట్టాము." పోలీసు చర్యపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సింగ్, "పోలీసులు ఆమె అత్తమామలు తలుపు తెరవకపోవడంతో బుల్‌డోజర్‌ని తీసుకురావడం ద్వారా వారిపై ఒత్తిడి తెచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. నా కూతురు ఇప్పుడు ఆనందంగా జీవించవచ్చని తెలిపారు.



సంబంధిత వార్తలు