
Kakinada, August 29: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో దారుణం జరిగింది. అప్పన్నపాలెంలో ఓ వ్యక్తి ఏడు నెలల గర్భిణీని కిరాతకంగా కత్తితో పొడిచి (Man brutally murders pregnant woman)చంపాడు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పన్నపాలెంకు చెందిన దూసర నాగరత్నంకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి.
కాగా, సోమవారం వారి బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో భర్త, కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో నాగరత్నం మాత్రమే ఇంట్లో ఉండగా.. అదే అదునుగా పిల్లి రాజు అనే వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి (Man brutally murder) చంపేశాడు. కాగా, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. ఎవరూలేని సమయంలో నాగరత్నం వద్దకు పిల్లిరాజుతో రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పిల్లిరాజుకు కూడా వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నాడు. హత్య సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే, పిల్లి రాజుపై అంతకుముందు కూడా పలు నేరాలపై పోలీసు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.