Mumbai Coronavirus: బెడ్ మీద కరోనా శవాలు, పక్కన నేల మీద రోగులు, ముంబై కెమ్ ఆస్పత్రి వీడియోని ట్విట్టర్లో షేర్ చేసిన నితేష్ రాణే, అలాంటిదేమి లేదన్న శివసేన
కరోనా వైరస్(COVID-19) ముంబైని వణికిస్తున్నాముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారుల తీరు మాత్రం మారడం లేదని తెలుస్తోంది. సియాన్ ఆస్పత్రిలో మృతదేహాల పక్కనే కరోనా పేషెంట్లకు చికిత్స అందించిన వీడియో మరువక ముందే మరో వీడియో బయటకు వచ్చింది. ముంబైలోని బిఎంసి నడుపుతున్న కెఇఎం ఆసుపత్రిలో (KEM Hospital) కోవిడ్ -19 వార్డులో రికార్డ్ చేసిన వీడియోను భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు నితేష్ రాణే (BJP MLA Nitesh Rane) సోమవారం పంచుకున్నారు.
Mumbai, May 11: కరోనా వైరస్(COVID-19) ముంబైని వణికిస్తున్నాముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారుల తీరు మాత్రం మారడం లేదని తెలుస్తోంది. సియాన్ ఆస్పత్రిలో మృతదేహాల పక్కనే కరోనా పేషెంట్లకు చికిత్స అందించిన వీడియో మరువక ముందే మరో వీడియో బయటకు వచ్చింది. ముంబైలోని బిఎంసి నడుపుతున్న కెఇఎం ఆసుపత్రిలో (KEM Hospital) కోవిడ్ -19 వార్డులో రికార్డ్ చేసిన వీడియోను భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు నితేష్ రాణే (BJP MLA Nitesh Rane) సోమవారం పంచుకున్నారు. మహారాష్ట్ర ఆసుపత్రిలో భయంకరమైన దృశ్యం, ఒకవైపు కోవిడ్-19 మృతుల శవాలు, పక్కనే రోగులకు చికిత్స. ఇదేం పాలన అంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడిన విపక్షం
ఈ వీడియోలో వార్డు లోపల రోగుల దగ్గర బాడీ బ్యాగులు పడి ఉన్నట్లుగా కనిపిస్తోంది. అన్ని పడకలు ఈ బాడీ బ్యాగులు ఆక్రమించబడినందున కొంతమంది రోగులు వార్డు నేలమీద కూర్చోవడం లేదా పడుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘పేషెంట్ల పక్కన శవాలు చూసేందుకు బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మనల్ని అలవాటు పడేలా చేస్తున్నారు.
అంతేతప్ప వారు మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేదు. అక్కడ సేవలు అందిస్తున్న హెల్త్‌వర్కర్ల ఆరోగ్యం గురించి కూడా తలచుకుంటే బాధేస్తోంది’’ అని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Nitesh Rane Shares Video Showing Body Bags Lying Near Patients at KEM Hospital:
ఆ వీడియోపై శివసేన శాసనసభ్యుడు అనిల్ దేశాయ్ (Anil Desai) మాట్లాడుతూ ఆసుపత్రులలోని రోగుల భద్రత కోసం గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాంటి వీడియో (కెఇఎం హాస్పిటల్) సోషల్ మీడియాలో వైరల్ అయితే అది ఆ క్షణంలోనే జరిగి ఉండవచ్చు కాని వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అక్కడ అధికారులందరూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఎవరినీ కించపరచాల్సిన అవసరం లేదు, "అని దేశాయ్ ANI కి చెప్పారు.
కాగా సియోన్ ఆసుపత్రిలో COVID-19 వార్డు లోపల తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వీడియోను రాణే ఇంతకు ముందు పంచుకున్నాడు, చికిత్స పొందుతున్న వారి పక్కన పడుకున్న రోగుల మృతదేహాలను ఈ వీడియో చూపించింది.ఈ వీడియో బయటకు వచ్చిన తరువాత, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) విచారణకు ఆదేశించి ఆసుపత్రి డీన్ ప్రమోద్ ఇంగ్లేను తన పదవి నుండి తొలగించింది. కాగా KEM ఆసుపత్రిలో రద్దీగా ఉన్న వార్డును చూపించే మరో క్లిప్ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కనిపించింది
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)