Vijay Thalapathy TVK Rally: రాజ‌కీయాల‌కు కొత్త కావొచ్చు..ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేదు..అన్ని స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది.. తొలిస‌భలోనే స్పీచ్ తో అద‌ర‌గొట్టిన ద‌ళ‌ప‌తి విజ‌య్

అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్‌ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు.

Vijay Thalapathy TVK Rally

Villupuram, OCT 27: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(Tamizhaga Vetri Kazhagam) పేరుతో పార్టీని స్థాపించిన ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అందులో భాగంగానే ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించారు. విల్లుపురంలో (Villupuram) నిర్వహించిన సభలో తమిళనాడు రాజకీయాలపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్‌ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు.

Tamizhaga Vetri Kazhagam Chief Holds First Public Rally

 

ఈ సందర్భంగా టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్‌ అభిమానులు హాజరయ్యారు.

Vijay Thalapathy TVK Rally

 

ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని విజయ్ ప్రకటించారు. తమిళనాడు గడ్డకు (Tamilnadu) అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్‌ ఈవీ రామస్వామి, కె.కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, వేలు నాచియార్‌, అంజలి అమ్మాళ్‌ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే (DMK), బీజేపీపై (BJP) విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్‌ సైతం విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తనను ఆర్టిస్ట్‌ అంటూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తొలి బహిరంగ సభలోనే తన స్పీచ్‌తో అదరగొట్టారు హీరో, టీవీకే అధినేత విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సభ వేదికగా విజయ్ ప్రకటించారు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

FM Nirmala Sitharaman: విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు రూ.14 వేల కోట్లు జమచేశాం, లోకసభలో ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు